Share News

Chennai: రన్‌వే పక్కనే గుడ్లు పెట్టిన పక్షి.. సోషల్‌ మీడియాలో వైరల్‌

ABN , Publish Date - Jul 12 , 2024 | 11:56 AM

స్థానిక మీనంబాక్కం సమీపంలోని విమానాశ్రయ రన్‌వే(Airport runway) పక్కనే ఓ పక్షి గుడ్లు పెట్టి పొదుగుతుండడం గమనించి ఉద్యోగులు దిగ్ర్భాంతి చెందారు. విమానాశ్రయ సమీపంలోని అడయార్‌ నది తీరం వెంబడి ఉన్న గడ్డి భూములు, తేమతో కూడిన ప్రాంతాల్లో పలురకాల పక్షులున్నాయి.

Chennai: రన్‌వే పక్కనే గుడ్లు పెట్టిన పక్షి.. సోషల్‌ మీడియాలో వైరల్‌

చెన్నై: స్థానిక మీనంబాక్కం సమీపంలోని విమానాశ్రయ రన్‌వే(Airport runway) పక్కనే ఓ పక్షి గుడ్లు పెట్టి పొదుగుతుండడం గమనించి ఉద్యోగులు దిగ్ర్భాంతి చెందారు. విమానాశ్రయ సమీపంలోని అడయార్‌ నది తీరం వెంబడి ఉన్న గడ్డి భూములు, తేమతో కూడిన ప్రాంతాల్లో పలురకాల పక్షులున్నాయి. ఈ పక్షులు విమానాశ్రయ రన్‌వే, పరిసర ప్రాంతాల్లో గుంపులుగా ఎగురుతుండడం, రన్‌వే పక్కనే ఉంటున్నాయి. దీంతో, విమానాల రాకపోకల సమయాల్లో ఉద్యోగులు టపాసులు కాల్చి పక్షులను తరిమేస్తుంటారు. ఈ నేపథ్యంలో, కొద్ది రోజుల క్రితం రన్‌వే సమీపంలో ఓ పక్షి అక్కడే కూర్చొని ఉండడం ఉద్యోగి గమనించాడు.

ఇదికూడా చదవండి: CBCID: మాజీ మంత్రి అనుచరుడి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు..


దగ్గరకు వెళ్లి చూడగా, ఆ పక్షి రెండు గుడ్లపై కూర్చొని పొదుగుతుండడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. ఆ దృశ్యాలను సదరు ఉద్యోగి తన సెల్‌ఫోన్‌(Cell phone)లో బంధించాడు. ఆ పక్షి ‘రెడ్‌ లాంప్‌వింగ్‌’ రకానికి చెందినదని, తక్కువ ఎత్తులో మాత్రమే ఎగురుతుందని తెలిసింది. అలాగే, ఎత్తైన స్థలం, చెట్లు, పంట పొలాలు తదితరాల్లో గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటుందని పక్షి ప్రేమికులు తెలిపారు. కాగా, రన్‌వే పక్కనే పక్షి గుడ్లు పెట్టి పొదిగే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇదికూడా చదవండి: Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 11:56 AM