Share News

Chennai: ‘మునగ’తో వ్యాపారం... ప్రకృతితో మమేకం

ABN , Publish Date - Aug 10 , 2024 | 12:54 PM

సుజాత స్వస్థలం తిరుచ్చి. ఆమె భర్తతో కలిసి మిరాకిల్‌ ట్రీ అనే సంస్థ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఉద్యానవనం, కళలపై మక్కువ ఎక్కువ. వారికి తోట కూడా ఉంది. ఈ సంస్థ ప్రారంభానికి ముందే ఆమె తోటలో పలురకాల కూరగాయలు పండించి, వాటిని మార్కెట్లో విక్రయించేవారు.

Chennai: ‘మునగ’తో వ్యాపారం... ప్రకృతితో మమేకం

- ‘మిరాకిల్‌ ట్రీ’తో రాణిస్తున్న ప్రకృతి ప్రేమికురాలు సుజాత

చెన్నై: ‘వ్యవసాయం అన్నది వ్యాపారం కాదు... అది మానవుల జీవన విధానం’ అన్నారు వ్యవసాయ శాస్త్రవేత్త నమ్మాళ్వార్‌(Agricultural Scientist Nammalwar). దీన్ని అనుసరిస్తూ తన జీవితాన్ని ప్రకృతితో మమేకం చేసి, ప్రకృతి ప్రసాదించిన ‘మునగ చెట్టు’ ద్వారా వివిధ వస్తువులు తయారుచేసి విక్రయిస్తున్నారు మదురైకి చెందిన సుజాత. ఆమె ‘మిరాకిల్‌ ట్రీ’(Miracle Tree) పేరిట ఓ సంస్థ ఏర్పాటుచేసి దాని ద్వారా వీటిని విక్రయిస్తున్నారు. ప్రకృతి ప్రేమికురాలిగా, వ్యాపారవేత్తగా ఆమె అందిస్తున్న సేవలను మెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పురస్కారాన్ని అందించింది. ఆమే నేటి తరుణి..

ఇదికూడా చదవండి: Chennai: స్టాలిన్‌ తలచుకుంటే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి..


సుజాత స్వస్థలం తిరుచ్చి. ఆమె భర్తతో కలిసి మిరాకిల్‌ ట్రీ అనే సంస్థ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఉద్యానవనం, కళలపై మక్కువ ఎక్కువ. వారికి తోట కూడా ఉంది. ఈ సంస్థ ప్రారంభానికి ముందే ఆమె తోటలో పలురకాల కూరగాయలు పండించి, వాటిని మార్కెట్లో విక్రయించేవారు. దీంతో ఆమెకు ఉద్యాన కళలలపై ఆసక్తి ఏర్పడింది. ప్రకృతి సేద్యం ద్వారా కూరగాయల్లో పోషక విలువలు ఉంటున్న విషయం గుర్తించి దానినే వృత్తిగా మార్చుకోవాలనే ఆసక్తి ఆ సంస్థకు ఆంకురార్పణ ఏర్పడింది.

nani5.3.jpg

పోషకాల ‘మునగ’...

మునగ చెట్టును కొందరు సాధారణమైనదిగా భావిస్తారు. ఈ చెట్టు ఆకులు, కాయలు సులభంగా లభిస్తుండడంతో ప్రజలు దీని గురించి మరెన్నో విషయాలు తెలుసుకోలేకపోతున్నారు.వాస్తవంగా చెప్పాలంటే అదొక ‘మిరాకిల్‌ చెట్టు’. ఈ చెట్టు ఆకులు, కాయలు, బెరడు అన్నింట్లో పోషకాలున్నాయి. దీంతో ఈ చెట్టుతోనే తమ వ్యాపారం ప్రారంభించాలని సుజాత దంపతులు నిర్ణయించుకున్నారు. సాధారణంగా ప్రజలు మునక్కాయలు, ఆకులు మాత్రమే తింటుంటారు. అలా కాకుండా కొత్తరకంగా అందించాలని నిర్ణయించిన సుజాత మొదట పౌడర్‌గా, అనంతరం బాల్‌ ఆకారంలోనూ ఆకలి పోగొట్టే పదార్థంగా మార్చి విక్రయానికి తీసుకొచ్చారు. ఆమె అందిస్తున్న ఉత్పత్తులు ప్రజాదరణ పొందడంతో విక్రయాలు కూడా పెరిగాయి.


ఆకును ఎండలో ఆరబెట్టకూడదు...

మునగ ఆకును ఎండలో ఆరబెట్టరాదు. ఎక్కువ ఎండ ఉంటే అందులోని పోషకాలు ఆవిరవుతాయి. దీంతో సుజాత ‘హీట్‌ పంప్‌’, ‘అలా్ట్ర లో టెంపరేచర్‌ డ్రయ్యర్‌’తో ఈ ఆకును ఎండబెడుతున్నారు. ఈ ఆకుతో పొడులు, తాలింపు తదితరాలు చేసుకోవచ్చు. ఆకును వేడినీళ్లలో ఐదు నిముషాలు వేసి ఉంచితే ఆకు అప్పుడే కోసినట్లు మారుతుంది. ఈ వృత్తి ప్రారంభించిన తొలిరోజుల్లో కష్టంగానే ఉండేది కానీ, నాణ్యమైన ఆహార పదార్ధాలు అందజేయాలనే లక్ష్యం మా కష్టాలను అధిగమించిందని సుజాత అంటున్నారు. మునగ ఆకులో ఉన్న ‘స్లైరులీనా’ను చిలకడం సాధారణ విషయం కాదు. ఈ పదార్ధాల తయారీ కోసం వారు పలురకాల పరిశోధనలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. అనంతరం మొట్టమొదటిసారిగా 2017లో జరిగిన వ్యవసాయ ఎగ్జిబిషన్‌లో సుజాత తమ సంస్థ ద్వారా తయారైన పదార్ధాలు పరిచయం చేయగా, విక్రయాలు బాగా జరిగాయి. పొడుల తయారీకి ఎక్కువ ఆకు అవసరమవుతుండడంతో వారి తోటనుంచే కాకుండా రైతుల నుంచి మునగ ఆకు కొనుగోలు చేస్తున్నారు.

nani5.4.jpg


మునగ ఆకు, పువ్వులు ఎండించి తేనెలో కలిపి తింటే మహిళలకు ఏర్పడే ‘పీసీఓడీ’ సమస్య, సంతానలేమి, గర్భకోశ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మునగ పువ్వు పొడిగాను, క్యాప్సిల్‌గాను ఇస్తున్నారు. విదేశాల్లో ముఖ్యంగా పారీ్‌సలో నివసించే తమిళులకు మునగకాయలు దొరికే పరిస్థితి లేదు. అందువల్ల సుజాత మునగ ఆకు ఎండబెట్టి ప్యాకింగ్‌ చేసి ఇస్తున్నారు.మునగ మాత్రమే కాకుండా వంకాయలు, క్యారెట్‌, పుదీనా,కరివేపాకు, కొత్తిమీర తదితరాలు కూడా పంపిస్తున్నారు. అలంగానల్లూర్‌లో 10ఎకరాల తోటలో సు మారు 1,000మునగ చెట్లున్నాయి. వీటితో పాటు తాటి, కొబ్బరి, కూరగాయల చెట్లున్నాయి.ప్రస్తుతం మునగతో చేస్తున్నట్లు తాటితో పదార్ధాలను తయారు చేస్తున్నారు సుజాత.

nani5.5.jpg

ఈ సందర్భంగా ఆమె తరుణితో మాట్లాడుతూ... భర్త సహకారం, సంస్థలో పనిచేసే ఉద్యోగుల శ్రమ, అంకితభావమే నా విజయానికి కారణమైంది. మా సంస్థలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారు. ‘మేము బాగుండాలి...ప్రజలు క్షేమంగా ఉండాలన్నదే’’. మా ముఖ్య ఉద్దేశం అని సుజాత తన మనోభావాలను పంచుకున్నారు.


మునగతో 50 రకాల వస్తువులు...

తొలుత మునక్కాయతో నూనె తయారుచేశారు. కంటి నరాలకు, అగ్ని గాయాలకు, కాళ్లు, చేతుల నొప్పులకు ఈ నూనె ఉత్తమ నివారణిగా మంచి పరిష్కారం ఇచ్చింది. మునగాకుతో సౌందర్య ఉత్పత్తులు కూడా తయారుచేస్తున్నారు. మునగ చెట్టు బంకను ప్రతిరోజూ రాత్రి పూట పాలల్లో కలిపి తీసుకుంటే దేహం దృఢమవుతుంది. మునగ ఆకుతో టీ, చాక్లెట్‌, ఎనర్జీ డ్రింక్‌, స్నాక్స్‌, ఇలా 50కి పైగా పదార్ధాలు తయారుచేసి విక్రయిస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 10 , 2024 | 12:54 PM