Viral News: లిప్‌స్టిక్‌తో వచ్చారని ట్రాన్స్‌ఫర్ చేసేశారు.. తర్వాత ఏమైందంటే..
ABN , Publish Date - Sep 27 , 2024 | 11:58 AM
మీరు ఎప్పుడైనా అందం కారణంగా ఉద్యోగి ట్రాన్స్‌ఫర్ అవ్వడం గురించి విన్నారా. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఈ సంఘటన ఇటివల చెన్నైలో చోటుచేసుకుంది. ఈ విషయంలో పలువురు విమర్శలు చేస్తుండగా, మరికొంత మంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది ఇక్కడ చుద్దాం.
సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు తప్పులు చేస్తే బదిలీ చేయడం లేదా సస్పెండ్ అవ్వడం వంటివి చూస్తునే ఉంటాం. కానీ ఎప్పుడైనా అందం కారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ట్రాన్స్‌ఫర్ అవ్వడం గురించి విన్నారా? లేదా.. అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఈ సంఘటన ఇటివల చెన్నైలో చోటుచేసుకుంది. లిప్‌స్టిక్ వేసుకుని విధులకు వచ్చినందుకు లేడీ తాబేదార్‌ను బదిలీ చేసిన ఘటన చెన్నైలో వెలుగుచూసింది.
చెన్నై మేయర్ ప్రియాకు 50 ఏళ్ల మాధవి అనే మహిళ తాబేదార్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ సంబంధిత సమావేశాలు, కార్యక్రమాలకు మేయర్ ఎక్కడికి వెళ్లినా మాధవి కూడా తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే వైట్ కలర్ యూనిఫాంలో ఉండే మాధవికి పెదవులకు లిప్‌స్టిక్ వేసుకునే అలవాటు ఉంది. కానీ ఇప్పుడు ఆ లిప్‌స్టిక్ ఆమె ట్రాన్స్‌పర్ కావడానికి కారణమైంది.
అకస్మాత్తుగా
ఆవడికి చెందిన మాధవి (50) 2009లో చెన్నై కార్పొరేషన్‌లో ఆఫీస్ అసిస్టెంట్‌గా చేరారు. ఇటీవల చెన్నై కార్పొరేషన్ మేయర్‌గా ఆర్.ప్రియా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు తాబేదార్‌గా మాధవి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో మాధవి ఆకస్మాత్తుగా మనాలి మండల కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే ఆమె లిప్ స్టిక్ వేసుకుని విధులకు రావడమే అందుకు కారణమని తెలుస్తోంది. మేయర్ వేసుకున్న రంగులనే మాధవి కూడా లిప్ స్టిక్ వేసుకోవడంపై మేయర్ పీఏలు అభ్యంతరం వ్యక్తం చేశారని మాధవి వాపోయారు.
లిప్‌స్టిక్ లొల్లి
తనకు నచ్చిన రంగు లిప్ స్టిక్ వేసుకుంటానని, మార్చుకోవడం కూదరదని మాధవి చెబుతోంది. ఆమె అంతలా పట్టుబట్టడంతోనే బదిలీ చేశారని, తర్వాత రోజుల్లో వారు తనకు విధులకు ఆలస్యంగా రావడంతో సహా 5 ప్రశ్నలతో వివరణ కోరుతూ మెమో ఇచ్చారని వివరించింది.
తాను సరైన వివరణ ఇచ్చినప్పటికీ, వారు మనాలికి బదిలీ చేశారని ఆమె విచారం వ్యక్తం చేశారు. మేయర్ వేసుకున్న రంగులో లిప్ స్టిక్ వేసుకుని పనికి రావడమే తన ఉద్యోగం మారడానికి కారణమని మాధవి చెప్పారు. అయితే లిప్‌స్టిక్ గొడవ తెలిసిన అనేక మంది ఇంత చిన్న వ్యవహారం జాబ్ ట్రాన్స్‌ఫర్ అయ్యే వరకు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు మేయర్ కార్యాలయం మాత్రం ఈ అంశాన్ని ఖండించింది.
ఇవి కూడా చదవండి..
Picture Puzzle: మీరు పజిల్ స్పెషలిస్టులా?.. ఈ వర్డ్ పజిల్‌లోని ``IRON``ను 8 సెకెన్లలో కనుక్కోండి...
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..