Chennai: మరణించిన కుమార్తెకు ఓణీల పండుగ...
ABN , Publish Date - May 15 , 2024 | 01:12 PM
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విధి విక్రించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. అయినా ఆ దంపతులు ఆ బిడ్డ జ్ఞాపకాలను మరువలేకపోయారు. అందుకే తమ బిడ్డకు ఓణీల కార్యక్రమం కూడా నిర్వహించి, ఆమె స్మృతిలో మైమరిచి పోయారు.
- కళ్ల ముందు లేని కూతురి కటౌట్‌కు వేడుక
చెన్నై: అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విధి విక్రించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. అయినా ఆ దంపతులు ఆ బిడ్డ జ్ఞాపకాలను మరువలేకపోయారు. అందుకే తమ బిడ్డకు ఓణీల కార్యక్రమం కూడా నిర్వహించి, ఆమె స్మృతిలో మైమరిచి పోయారు. శివగంగ(Sivaganga) జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలిలా... త్రిభువనం ప్రాంతానికి చెందిన బాలకృష్ణన్, రాకు దంపతుల కుమార్తె పాండిచ్చల్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. చిన్నతనం నుంచే నగలన్నా, పూవులన్నా ఇతర అలంకారం చేసుకోవాలన్నా పాండిచ్చల్‌కు అమిత ఇష్టం. తల్లితో పాటు శుభ కార్యక్రమాలకు వెళ్లే సమయంలో చక్కగా అలంకరించుకొని అందర్నీ ఆకట్టుకునేది.
ఇదికూడా చదవండి: Instagram Fraud: ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు.. చెల్లెమ్మా అంటూ దగ్గరయ్యారు.. చివరికి?
మూడేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా పాండిచ్చల్ మరణించడంతో తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోయారు. భౌతికంగా కుమార్తె తమతో లేకపోయినప్పటికీ ఉన్నట్లు భావించి ప్రతి ఏటా పుట్టినరోజు(Birthday) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మరణించిన కుమార్తెకు ప్రస్తుతం 11 ఏళ్లు కావడంతో ఆమె ఉన్నట్లే భావించిన తల్లిదండ్రులు ఆమె ఆకారంతో రూపొందించిన కటౌట్‌కు ఓణీల ఫంక్షన్ జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆహ్వానపత్రికలు ముద్రించి తమకు తెలిసిన బంధువులకు, మిత్రులకు పంచిపెట్టారు. సోమవారం త్రిభువనం ప్రాంతంలోని ఓ కల్యాణ మండపంలో వేదికపై పాండిచ్చల్ కటౌట్‌కు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి మెడలో పూలదండ వేసి ఓణీల వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కటౌట్ ముందు నిలబడి ఉత్సాహంగా సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
ఇదికూడా చదవండి: Youtube: బ్యాంక్ దోపిడీ ఎలా చేయాలి...? యూట్యూబ్ చూస్తూ చోరీకి యత్నం
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News