Share News

Viral: సప్తపదిని కాదని.. రాజ్యాంగంపై ప్రమాణంతో పెళ్లి చేసుకున్న జంట!

ABN , Publish Date - Dec 21 , 2024 | 06:38 PM

ఓ యువ జంట తమ పెళ్లిని అత్యంత నిరాడంబరంగా జరుపుకున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సప్తపది వంటి సంప్రదాయ క్రతువులను కాదనుకుని ఆ జంట భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి వివాహం బంధంలో ఒక్కటయ్యారు.

Viral: సప్తపదిని కాదని.. రాజ్యాంగంపై ప్రమాణంతో పెళ్లి చేసుకున్న జంట!

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో పెళ్లంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. జీవితంలో అతి ముఖ్యమైన వివాహాన్ని వీలైనంత కొత్తగా జరుపుకోవాలని యువతీయువకులు ఖర్చులకు వెనకాడకుండా డెస్టినేషన్ వెడ్డింగులకు సైతం సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువ జంట తమ పెళ్లిని అత్యంత నిరాడంబరంగా జరుపుకున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆదర్శవంతమైన జంట అంటూ అనేక మంది నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది (Viral).

Viral: రైలు కిటికీ అద్దాలు పగలగొట్టిన ప్యాసెంజర్లు.. షాకింగ్ దృశ్యాలు వైరల్!


కాపూ గ్రామంలో డిసెంబర్ 18న ఈ వివాహం జరిగింది. వధువు పేరు ప్రతిమా లాహ్రే, వరుడి పేరు ఎమాన్. అయితే, వివాహం ఖర్చు తగ్గించుకునేందుకు ఈ జంట సంప్రదాయక క్రతువులకు గుడ్ బై చెప్పేశారు. బ్యాండ్ బాజా మధ్య ఊరేగింపు, ఏడు అడుగులు వేయడం, వధువు నుదుటున వరుడు సింధూరం దిద్దడం వంటివన్నిటికి గుడ్‌బై చెప్పి రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ ఫొటో ముందు నిలబడి రాజ్యాంగం కాపీపై ఇద్దరూ చేతులు వేసి.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచుంటామంటూ ప్రరస్పరం ప్రమాణం చేసుకున్నారు.

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!


ఇలా రాజ్యాంగంపై ప్రమాణం చేయడం వెనకున్న కారణాన్ని వధువు స్వయంగా వివరించింది. ‘‘ఈ విధానంతో అలివికాని పెళ్లి ఖర్చులకు అడ్డుకట్ట వేయొచ్చు. అందుకే, మా కుటుంబాల అనుమతితో ఇలా చేశాం’’ అని ఆమె చెప్పుకొచ్చింది.

కాగా, పెళ్లికొచ్చిన వారందరూ వధూవరుల చర్యను సమర్థించారు. వివాహ క్రతువుకు సంబంధించి ఇదో అర్థవంతమైన విధానమని అన్నారు. ఈ జంట ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచిందని కితాబునిచ్చారు. యువ జంటను పెళ్లికొచ్చిన అతిథులతో పాటు స్థానిక పెద్దలు కూడా ఆశీర్వదించారు. వారు కలకలం సుఖసంతోషాలతో జీవించాలని నిండుమనసుతో కోరుకున్నారు. సత్నామీ సమాజానికి చెందిన ఆ జంట డిసెంబర్ 18న తమ గురువు అయిన గురు ఘాసీదాస్ జయంతి నాడు వివాహ బంధంలో ఒక్కటయ్యారు. అయితే, ఇటీవల కాలంలో అనేక జంటలు పెళ్లి ఖర్చులు తగ్గించుకునేందుకు వినూత్న పంథాలను అనుసరిస్తున్నాయి.

Viral: యువకుడికి షాక్! పెళ్లికోసమై వలలో పడి.. రూ.55 లక్షల నష్టపోయి..

Viral: ద్రవ్యోల్బణం పీక్స్‌కెళ్లడం అంటే ఇదీ! కప్పు కాఫీ ధర ఎంతో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Dec 21 , 2024 | 06:50 PM