Share News

Viral: మంటలు అంటుకున్న పట్టాలపై దూసుకెళ్లిన రైలు.. షాకింగ్ సీన్

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:38 AM

రైలు పట్టాలపై మంచుపేరుకుని ప్రమాదకరంగా మారుతుండటంతో చికాగో అధికారులు ఓ వినూత్న పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. రైలు పట్టాలను హీటర్లతో వేడి చేసి స్విచ్‌లపై మంచు తొలగిపోయేలా చేశారు. ఈ క్రమంలో ట్రాక్స్‌పై మంటలు కనిపించడం, వాటిపై నుంచి రైలు దూసుకుపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Viral: మంటలు అంటుకున్న పట్టాలపై దూసుకెళ్లిన రైలు.. షాకింగ్ సీన్
Chicago Uses Controlled Fires To Keep Railway Switches Ice-free

ఇంటర్నెట్ డెస్క్: రైలు పట్టాలపై చెలరేగుతున్న మంటలు.. వాటిపైనుంచి దూసుకెళ్లిన రైలు! ఇదేమీ గ్రాఫిక్స్ సినిమా కాదు.. యాక్షన్ మూవీలో స్టంట్ సీన్ అంత కన్నా కాదు! అమెరికాలోని చికాగో రాష్ట్రంలో ఈ దృశ్యం కనిపించింది. దీని వెనకున్న కారణం తెలిసి జనాలు కూడా షాకైపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో @barefactsofficial అనే ఇన్‌స్టా అకౌంట్‌లో వైరల్‌గా (Viral) మారింది.

Viral: ఫుల్లుగా తాగి టిక్కెట్లు బుక్ చేసిన యువతి! విమానం ఎక్కాక..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రైల్వే సిబ్బంది కావాలనే ట్రాక్స్‌కు ఇలా నిప్పు పెట్టి వాటిపై నుంచి రైళ్లను నడిపించారు. అక్కడ భారీగా మంచుకురుస్తుండటంతో ట్రాక్స్‌పై మంచు పేరుకుపోతోందట. ఈ పరిణామం కారణంగా రైళ్లు పట్టాలు తప్పే అవకాశాలు పెరిగిపోయాయి. రైలు పట్టాలపై ఉండే స్విచ్‌లు పనిచేయకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అధికారులు ఈ వ్యూహాత్మక పరిష్కారానికి తెరతీశారు. దీంతో, వేడి జనించి స్విచ్చ్‌లపై పేరుకున్న మంచు కరిగిపోయింది. రైలు దిశను మార్చేందుకు స్విచ్‌లు కీలకమని, ఇవి సరిగా పనిచేయకపోతే రైళ్ల రాకపోకలకు అవాంతరాలతో పాటు అవి పట్టాలు తప్పే అవకాశం కూడా ఉందన్నారు.


మంచు సమస్యను తొలగించేందుకు సిబ్బంది రైళ్ల పట్టాలపై పలు చోట్ల గ్యాస్‌తో నడిచే హీటర్లు ఏర్పాటు చేశారు. వీటిని సిబ్బంది స్వయంగా ఆన్ చేయాల్సి రావడంతో ట్రాక్‌లపై ఇలా మంటలు కనిపించాయట. హీటర్ల ద్వారా పుట్టే వేడితో ట్రాక్స్‌పై మంచు కరిగిపోయి రైల్వే కార్యకలాపాలు సవ్యంగా సాగిపోతాయట. ఈ మంటల కారణంగా రైలుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వీటిని ఏర్పాటు చేశారట. ఫలితంగా, ట్రాక్స్‌పై మంటలు ఉన్నప్పటికీ రైళ్లు తమ సహజ వేగంతో దూసుకుపోతున్నాయి. చలికాలంలో ఈ ఏర్పాట్లతో రైల్వే రాకపోకలకు అవాంతరాలన్నీ తొలగిపోయాయని చెబుతున్నారు.

ఇక ఈ వింత వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. వీడియోకు దాదాపు 2.5 లక్షల వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు రైల్వే సిబ్బంది వినూత్న పరిష్కారంపై ప్రశంసలు కురిపించారు.

Read Latest and Viral News

Updated Date - Sep 06 , 2024 | 11:40 AM