Share News

Viral: లెక్క సరిగ్గా చేయలేదని కొడుకును కొట్టిన తండ్రి.. డాక్టర్లు షాక్.. అసలేం జరిగిందంటే..!

ABN , Publish Date - May 28 , 2024 | 04:07 PM

హోమ్ వర్క్ సరిగ్గా చెయ్యకపోతే పిల్లలపై తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఆగ్రహం ప్రదర్శిస్తుంటారు. కొన్నిసార్లు కొడుతుంటారు. అయితే ఆ ఆగ్రహం కారణంగా ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.

Viral: లెక్క సరిగ్గా చేయలేదని కొడుకును కొట్టిన తండ్రి.. డాక్టర్లు షాక్.. అసలేం జరిగిందంటే..!
Home work

హోమ్ వర్క్ (Home Work) సరిగ్గా చెయ్యకపోతే పిల్లలపై (Child) తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఆగ్రహం ప్రదర్శిస్తుంటారు. కొన్నిసార్లు కొడుతుంటారు. అయితే ఆ ఆగ్రహం కారణంగా ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. చైనాలో (China) తాజాగా అలాంటి ఘటనే జరిగింది. కొడుకు లెక్క సరిగా చెయ్యలేదని తండ్రి (Father) ప్రదర్శించిన ఆగ్రహం.. కొడుకును హాస్పిటల్ పాలు చేసింది. తండ్రిని జైలు పాలు చేయనుంది (Viral News).


చైనాలోని సిచువాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కొడుక్కి దగ్గరుండి హోమ్ వర్క్ చేయిస్తున్నాడు. తండ్రి చెబుతున్న లెక్కలను కొడుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు. దీంతో తండ్రి కోపం పెంచుకుని పక్కనే ఉన్న దానిమ్మ పండుకు కొడుకు పైకి విసిరాడు. దానిమ్మ గట్టిగా తగలడంతో ఆ కుర్రాడు బిగ్గరగా కేకలు వేశాడు. గాయం గుర్తులేవీ కనిపించకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. అయితే తర్వాతి రోజుకు కూడా కూడా ఆ కుర్రాడికి నొప్పి తగ్గలేదు.


ఆ కుర్రాడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే ఆ కుర్రాడి కర్ణభేరి పగిలిపోయింది. దానిమ్మ నేరుగా చెవి మీద తగలడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. కాగా, చైనా నిబంధనల ప్రకారం పిల్లలపై గృహ హింసకు పాల్పడితే అక్కడి చట్టల ప్రకారం మూడేళ్ల వరకు శిక్ష విధిస్తారు. ఈ కుర్రాడి తండ్రికి కూడా శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి..

Viral: ఈ తాతను పట్టుకుంటే లాటరీ కొట్టినట్టే.. కోటి రూపాయలు దొరికినట్టే.. వైరల్ పోస్ట్‌పై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు!


Mount Everest: అయ్యబాబోయ్.! అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ మొదలైందా? ఎవరెస్ట్ వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 28 , 2024 | 04:07 PM