Viral Video: ఇంత పిచ్చి ఏంటి అమ్మా.. పిల్లాడిని ఎత్తుకుని రీల్స్ కోసం డ్యాన్స్.. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందంటే..
ABN , Publish Date - Jul 29 , 2024 | 11:08 AM
ప్రస్తుత డిజిటల్ యుగంలో పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా అందరూ రీల్స్‌తోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. మొబైల్‌లో రీల్స్ చూసేందుకు గంటలు గంటలు సమయం వెచ్చించే వారు కొందరైతే, వాటిని రూపొందించేందుకు టైమ్ స్పెండ్ చేసే వారు మరికొందరు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా అందరూ రీల్స్ (Reels)తోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. మొబైల్‌లో రీల్స్ చూసేందుకు గంటలు గంటలు సమయం వెచ్చించే వారు కొందరైతే, వాటిని రూపొందించేందుకు టైమ్ స్పెండ్ చేసే వారు మరికొందరు. రీల్స్ రూపొందించి పాపులారిటీ సంపాదించాలనే తాపత్రయం చాలా మందిలో పెరుగుతోంది. తాజాగా ఓ మహిళ తన కొడుకు (Child)ను ఎత్తుకుని డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆమె తీరులో మార్పు రాలేదు (Viral Video).
memer_monster అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తోంది. ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా ఆమె తన కొడుకును ఎత్తుకుని డ్యాన్స్ చేస్తోంది. ఆమె హై స్పీడ్‌లో డ్యాన్స్ వేస్తుండడంతో ఆ చిన్నారి ఆమె చేతుల నుంచి జారిపోయాడు. ఆ కుర్రాడి తల కిందకు వాలిపోయింది. కాళ్లను ఆమె గట్టిగా పట్టుకుని మళ్లీ పైకి లేపింది. ఆ దెబ్బకు చిన్నారి భయపడిపోయి ఏడుపు మొదలెట్టాడు. అయినా ఆ తల్లి పట్టించుకోకుండా నవ్వుతూ కెమేరా వైపు చూస్తూ ఉండిపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించిన తల్లిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఆమెకు కొడుకు కంటే రీల్స్ చాలా ముఖ్యం``, ``ఇది ఒక మానసిక రోగం``, ``ఆ చిన్నారి కింద పడిపోయినా ఆమె పట్టించుకునే స్థితిలో లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!
Optical Illusion: మీ కళ్ల పవర్ ఏంటో తెలుసుకోండి.. వీళ్లలో నిద్రపోతున్న పాపను గుర్తించండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.