Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!
ABN , Publish Date - Jul 29 , 2024 | 10:39 AM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ లివింగ్ రూమ్ కనిపిస్తోంది. నలుగురు కుటుంబ సభ్యులు ఆ గదిలో రిలాక్స్ అవుతూ చదువుకుంటున్నారు. వారితో పాటు ఆ గదిలో కుక్క, పిల్ల, ఇతర వస్తువులు ఉన్నాయి. అయితే ఆ గదిలో ఆంగ్ల పదం ``story`` కూడా దాక్కుని ఉంది. ఆ పదం ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల లోపు ఆ పదం ఎక్కడుందో కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ కళ్లు చాలా షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ పదం ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ కళ్ల పవర్ ఏంటో తెలుసుకోండి.. వీళ్లలో నిద్రపోతున్న పాపను గుర్తించండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.