Share News

Viral: ఫ్యాక్టరీ మూతపడ్డాక ఉద్యోగులు కనిపించట్లేదని ప్రకటన! ఎందుకో తెలిస్తే..

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:42 PM

ఉద్యోగులకు టైం ప్రకారం జీతాలు ఇవ్వని కంపెనీలు ఉన్న ఈ రోజుల్లో ఓ సంస్థ యజమాని తన ఉద్యోగులకు ఏకంగా 8.2 లక్షల పంపిణీ చేశాడు. కంపెనీ మూసేసిన 20 ఏళ్ల తరువాత అప్పటి ఉద్యోగులందరినీ వెతికి మరీ ఈ డబ్బు ఇచ్చాడు.

Viral: ఫ్యాక్టరీ మూతపడ్డాక ఉద్యోగులు కనిపించట్లేదని ప్రకటన! ఎందుకో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులకు టైం ప్రకారం జీతాలు ఇవ్వని కంపెనీలు ఉన్న ఈ రోజుల్లో ఓ సంస్థ యజమాని తన ఉద్యోగులకు ఏకంగా రూ. 8.2 లక్షల పరిహారం పంపిణీ చేశాడు. కంపెనీ మూసేసిన 24 ఏళ్ల తరువాత అప్పటి ఉద్యోగులందరినీ వెతికి మరీ ఈ డబ్బు ఇచ్చాడు. ఇప్పటికే 371 మందికి డబ్బు ఇచ్చిన ఆయన మరి కొందరి కోసం ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం చైనాలో తెగ వైరల్ (Viral) అవుతోంది.

Viral: ఈ పిల్ల సింహం నిజంగా లక్కీ! ఒక్కసారిగా అడవి దున్నల గుంపు దాడి చేస్తే..


గావ్ జాంగ్జీ అనే వ్యాపారవేత్తకు ప్రస్తుతం 70 ఏళ్లు. 1971లో ఆయన చాంగ్‌కింగ్ జనరల్ వాల్వ్ అనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. 2000లో సంస్థ మూతపడింది. ఆ భవనం ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న నగరపాలక సంస్థ ఫ్యాక్టరీని కూల్చేసింది. 2018లో ఒక మిలియన్ డాలర్లను పరిహారం ప్రకటించింది. గతేడాది మార్చిలో గావ్ జాంగ్జీకి పరిహారం అందడంతో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఆ పరిహారంలో వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబసభ్యులకు ఆ వాటా అందజేయాలనుకున్నారు (China Factory Owner Distributes $1 Million Among 400 Ex-Workers).

Viral: పదేళ్లుగా వీధుల్లో నివసిస్తున్న మహిళకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్!


ఇక కంపెనీ మూతపడే సమయానికి పనిచేస్తున్న ఉద్యోగులకు మొత్తం డబ్బులో 65 శాతం, అప్పటికే రిటైర్ అయ్యి లేదా రాజీనామా చేసి వెళ్లిపోయిన వారికి 35 శాతం కింద ఇద్దామనుకున్నారు. అయితే, దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మూతపడ్డ సంస్థలో పనిచేసిన వారి ఆచూకీ వెతికిపట్టుకోవడం ఆయనకు కష్టంగా మారింది. అయినా వెనక్కు తగ్గని ఆయన, ఉద్యోగుల ఫొటోలను పేపర్లు, పాంప్లెట్‌ మీద ముద్రించి వారి తప్పిపోయారని ప్రకటించారు. అలా ఒక్కొక్కరిగా 371 మంది ఆచూకీ కనుక్కున్నాక డబ్బు అందజేశారు. మరో 35 మంది కోసం ఇంకా వెతుకుతున్నారు.

ఆసుపత్రిలో జీవితచరమాంకానికి చేరుకున్న ఓ మాజీ ఉద్యోగినికి కూడా జాంగ్జీ గొప్పమనసు కారణంగా డబ్బు చేరింది. ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు చాలక అల్లాడుతున్న ఆ ఉద్యోగిని డబ్బు చూసుకుని మనశ్శాంతి పొందిందని, చివరకు ఆసుపత్రిలోనే కన్నుమూసిందని ఆమె సంతానం మీడియాకు తెలిపింది. ఈ ఉదంతం వైరల్ కావడంతో ఫ్యాక్టరీ యజమాని పెద్ద మనసుకు చైనా ప్రజలు జైకొడుతున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 05:49 PM