Share News

Viral: రెండేళ్ల క్రితం తిన్న మిరపకాయ ఎంత పని చేసిందీ! ఇతడి పరిస్థితి చూస్తే..

ABN , Publish Date - Jul 25 , 2024 | 09:36 PM

ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న మిరపకాయ కారణంగా ఓ వ్యక్తి రెండేళ్ల పాటు అవస్థ పడ్డాడు. దగ్గుకు కారణం క్యాన్సర్ అని భావించి రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఇది మిరపకాయ వల్ల వచ్చిన సమస్య అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చైనాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: రెండేళ్ల క్రితం తిన్న మిరపకాయ ఎంత పని చేసిందీ! ఇతడి పరిస్థితి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: మనిషి శరీరం చాలా విచిత్రమైంది. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే సామర్థ్యం దీని సొంతం. అదే సమయంలో ఒక్కోసారి చిన్న విషయాలే పెను చిక్కులు తెచ్చిపెడతాయి. శరీరంలోని సమస్య ఏంటో, ఎందుకొచ్చిందో అర్థంకాక, పరిష్కారం తెలీక తికమకపడాల్సి వస్తుంది. చివరకు పెను ఉపద్రవం అనుకున్నది కాస్తా దూదిలా గాల్లో ఎగిరిపోతుంది. తాజాగా చైనా వ్యక్తి విషయంలో ఇదే జరిగింది (Viral). ఒక మిరపకాయ కారణంగా అతడు ఏకంగా రెండేళ్ల పాటు నరకం అనుభవించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే, జంజియాంగ్‌కు చెందిన జూ అనే 54 ఏళ్ల వ్యక్తి రెండేళ్లుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నారు. మెడికల్ షాపులో తనకు తెలిసి మందులన్నీ తెచ్చి వాడినా ఉపశమనం మాత్రం లభించలేదు. నిత్యం దగ్గు అతడిని వేధించేది. ఉపద్రవం రాబోతోందేమోనని ఒక్కోసారి వణికిపోయాడు. చివరకు తన సొంత వైద్యంతో ప్రయోజనం శూన్యం అని గుర్తించిన అతడు చివరకు వైద్యులను సంప్రదించారు (China Man With Cough For Over 2 Years Discovers It Was Caused By Chilli Pepper).

Viral: 45 ఏళ్లకే రిటైర్ అవ్వాలని ప్లాన్! కష్టపడి రూ.5.35 కోట్లు కూడబెడితే..


వైద్యులు జూకు రకరకాల పరీక్షలు చేశారు. న్యూమోనియా లేదా క్యాన్సర్ ఉండొచ్చని సీటీ స్కాన్ తీస్తే సెంటీమీటర్ పొడవున్న కణితి కనిపించింది. మరిన్ని అధునాత పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తుల మధ్యలో లిఫ్ నోడ్స్ వాచినట్టు కనిపించాయి. మరింత లోతుగా పరిశీలించేందుకు వైద్యులు కణితిలో ఓ భాగాన్ని తొలగించాలనుకున్నారు. ఈ క్రమంలో వారికి మిరపకాయ తొడిమి కనిపించి షాకైపోయారు. దాన్ని జాగ్రత్తగా తొలగించడంతో అతడి సమస్య తొలగిపోయింది.


అసలేం జరిగిందీ తెలిసి జూ కూడా షాకైపోయాడు. రెండేళ్ల క్రితం తాను ఓ విందులో తింటుండగా మిరపకాయ గొంతులో అడ్డుపడి బాగా దగ్గొచ్చిందని చెప్పాడు. నాటి నుంచి అది వదలకుండా వేధిస్తోందని అన్నాడు. ఇక గొంతుకకు అడ్డం పడ్డ మిరపకాయ తొడిమి చివరకు ఊరిపితిత్తిలోకి చేరిందని వైద్యులు తెలిపారు. ఊరిపితిత్తుల మధ్యలో దాక్కుని ఉండటంతో సాధారణ పరీక్షల్లో అది కనిపించలేదని అన్నారు. మిరపకాయ కారణంగానే లింఫ్స్ నోడ్స్ వాచాయని కూడా చెప్పారు. మిరపకాయ కారణంగా ఇన్ఫెక్షన్ తలెత్తి ఆ భాగమంతా వాచిందని చెప్పారు. రెండేళ్ల పాటు దగ్గు అతడిని బాధ పెట్టిందన్నారు. ఇంత చిన్న మిరపకాయ అంతపెద్ద సమస్య తెచ్చిందని తెలిసి జూ కూడా ఆశ్చర్యపోయాడు. ఇలాంటి తన జీవితంలో జరుగుతుందని అస్సలు ఊహించలేదని చెప్పారు. ఇక ఘటన నెట్టింట వైరల్ కావడంతో జనాలు కూడా నోరెళ్లబెడుతున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 09:36 PM