Viral: బాస్ తిట్టడంతో షాక్! చలనం లేకుండా బొమ్మలా మారిపోయిన యువతి!
ABN , Publish Date - Oct 27 , 2024 | 03:49 PM
బాస్ తిట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ చైనా యువతి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చివరకు చలనమే లేకుండా బొమ్మలా మారిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: బాస్ తిట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ చైనా యువతి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చివరకు చలనమే లేకుండా బొమ్మలా మారిపోయింది. ఈ ఘటన చైనాలో పెను కలకలానికి దారి తీసింది (Viral).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, హెన్నాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ అనే యువతిని ఇటీవల ఆమె బాస్ పని విషయమై తిట్టిపోశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న లీ తీవ్ర మనోవేదనకు లోనైంది. మానసికంగా పెద్ద దెబ్బతగలడంతో డిప్రెషన్ పతాకస్థాయికి చేరుకుంది. ఎంతగా అంటే ఇది ఆమె శరీరంపై కూడా ప్రభావం చూపించింది. చివరకు ఆమె చెయ్యీకాలూ కదపలేని స్థితికి చేరుకుంది.
Viral: ఊహించని రీతిలో చిరుత సాహసం! ప్రాణాలకు తెగించి మరీ.. షాకింగ్ వీడియో
ఆమె రోజువారీ పనులు చేసుకోవాలన్నా కుటుంబ సభ్యులు సాయం చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. తలకింద దిండు తొలగిస్తే ఆమె తల వేలాడేసేదని, కనీసం తలపైకెత్తాలన్న స్పృహ, చలనం కూడా ఆమెలో కనిపించేది కాదని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె బాగోగులు చూసుకునేందుకు నిరంతరం ఎవరో ఒకరు వెన్నంటే ఉండాల్సి వచ్చేదని అన్నారు.
లీని ఆసుపత్రికి తరలించగా వైద్యులను కూడా ఆమె పరిస్థితి ఆశ్చర్యపరిచింది. చలనం లేకుండా అలా పడి ఉన్న లీని చూస్తే ఏదో చెక్క బొమ్మను చూసినట్టు అనిపించిందని ఆమెకు చికిత్స అందించిన వైద్యుడు తెలిపారు. బాస్ తిట్లకు డిప్రెషన్ పతాకస్థాయికి చేరుకోవడంతో ఆమె కెటాటానిక్ స్టూపర్ అనే సమస్య బారిన పడిందని వివరించారు. ఈ స్థితికి చేరుకున్న వారి శరీరంలో కదలికలు ఉండవని, అవయవాలను కదల్చలేరని, లోకంతో నిమిత్తం లేనట్టు ఎటువంటి స్పందనలూ కనిపించవని వివరించారు. మానసికంగా దెబ్బలు తగిలినప్పుడు డిప్రెషన్ తీవ్రస్థాయికి చేరితే ఇలాంటి పరిణామం సంభవిస్తుందని వివరించారు. లీ అంతర్ముఖురాలు కూడా కావడంతో బాస్ విమర్శల ప్రభావం ఎక్కువగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. అయితే, వైద్యుల చికిత్సతో కొంత మేర కోలుకున్న ఆమె మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.
Saudi Arabia: ప్రపంచంలోనే అతిపెద్ద భవనాన్ని నిర్మించనున్న సౌదీ అరేబియా!
కాగా, ఈ ఘటనపై చైనా సోషల్ మీడియాలో గగ్గోలు రేగింది. లీ స్థితి తెలుసుకుని అనేక మంది విచారం వ్యక్తం చేశారు. జాబ్‌లో ఇమడలేకపోతున్నప్పుడు వెంటనే రాజీనామా చేసేయాలి కానీ అలా తమలో తామే కుమిలిపోకూడదు’’ అని అన్నారు.
చైనాలో ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం, దాదాపు 80 శాతం మంది తాము పనిప్రదేశంలో అనేక సందర్భాల్లో తీవ్ర అసహనానికి లోనైనట్టు చెప్పుకొచ్చారు. ఆఫీసులో ఉండగా ఆందోళనకు లోనవుతున్నామని 60 శాతం మంది, డిప్రెషన్ కూడా వచ్చిపడిందని మరో 40 శాతం మంది చెప్పుకొచ్చారు.
Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..