Viral: బాస్‌కు పాదాభివందనం.. చైనా కంపెనీలో దారుణ సంస్కృతి!
ABN , Publish Date - Dec 17 , 2024 | 11:08 PM
ఉద్యోగులను రాచిరంపాన పెట్టే సంస్కృతి అనేక కంపెనీల్లో విస్తరిస్తోంది. ఈ విషపూరిత పని సంస్కృతి విషయంలో చైనాపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ చైనా కంపెనీలు దారుణ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట కాలు పెట్టి కలకలం రేపుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులను రాచిరంపాన పెట్టే సంస్కృతి అనేక కంపెనీల్లో విస్తరిస్తోంది. ఈ విషపూరిత పని సంస్కృతి విషయంలో చైనాపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ చైనా కంపెనీలు దారుణ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట కాలు పెట్టి కలకలం రేపుతున్నాయి. ఆ సంస్థలోని ఉద్యోగులు తమ బాస్ ముందు బోర్లాపడుకుని పాదాభివందం చేస్తున్న వైనంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు (Viral).
Viral: పబ్లిక్‌గా జంట అధర చుంబనాలు.. మెట్రో స్టేషన్‌లో షాకింగ్ సీన్!
గ్వాంగ్జూ నగరంలోని ఓ కంపెనీలో బాస్ ఉద్యోగులతో రోజూ పాదాభివందం చేయించుకుంటున్న వార్త స్థానికంగా కలకలానికి దారి తీసింది. ఇక వీడియోలో కనిపించిన దాని ప్రకారం పురుష ఉద్యోగులతో పాటు మహిళలు కూడా బాస్ రాగానే వరుసగా నేలమీద బోర్లాపడుకుని పాదాభివందం చేశారు. ‘‘బాస్‌కు స్వాగతం.. మేము చచ్చినా బతికినా పనిలో లక్ష్యాలను మాత్రం చేరుకుంటాము’’ అంటూ ప్రమాణం చేశారు. ఇది అక్కడి ఉద్యోగులకు నిత్య కృత్యమని, ప్రతి రోజూ బాస్‌కు ఇలాగే ఆహ్వానం పలుకుతారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Viral: ఈ ఏనుగుకు ఎంత మర్యాద! తన దారికి అడ్డుగా నిలబడ్డ వ్యక్తిని..
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట కలకలం రేగింది. ఇది నమ్మశక్యంగా లేదని, ఉద్యోగులను ఇంతలా ఎలా భయపెట్టగలిగారని కొందరు ప్రశ్నించారు. ఈ వీడియోపై సదరు సంస్థ కూడా స్పందించింది. వైరల్ వీడియోలో వాస్తవం లేదని, తమ కంపెనీలో అసలు అలాంటి సంస్కృతికి చోటే లేదని చెప్పుకొచ్చింది. ఆ బ్రాంచిలో బాస్ ఎప్పుడూ ఉద్యోగులను అలా వేధించలేదని స్పష్టం చేసింది. కాగా, చైనా కంపెనీల్లో ఉద్యోగులు నరకం అనుభవిస్తారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వారిపై సంస్థలు తీవ్ర ఒత్తిడి పెడతాయని, అమానవీయంగా వ్యవహరిస్తాయని వార్తా కథనాలు వెలువడ్డాయి. కాగా, గత అక్టోబర్‌లో ఓ కంపెనీ ఫిట్‌నెట్ పాలసీ పేరిట ఉద్యోగులు రోజుకు 18 వేల అడుగు వేయాలని ఆదేశించడం కలకలానికి దారితీసింది. ఈ రూల్‌ను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు కూడా విధించడం పెద్ద చర్చకు దారి తీసింది.
Viral: 43 ఏళ్లల్లో 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు! ఎందుకంటే..
Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!