Share News

Viral: పురుగుపై కోపంతో రెచ్చిపోయాడు.. చివరకు తన కన్నునే పోగొట్టుకున్నాడు!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:45 PM

కన్నుపై వాలిన పురుగు చంపి ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడో చైనా వ్యక్తి. మందులకు లొంగని ఇన్ఫెక్షన్ చివరకు మెదడుకు పాకే అవకాశం ఉండటంతో వైద్యులు అతడి కన్నును తొలగించేశారు.

Viral: పురుగుపై కోపంతో రెచ్చిపోయాడు.. చివరకు తన కన్నునే పోగొట్టుకున్నాడు!

ఇంటర్నెట్ డెస్క్: ఈగలు లేదా దోమలు తరచూ ఒంటిమీద వాలుతూ, కుడుతూ ఇబ్బంది పెట్టడం మామూలే. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది వాటిని తోలేసే ప్రయత్నం చేస్తారు. దోమలను ఒక్క దెబ్బతో చంపేసేందుకే మొగ్గు చూపుతారు. ఈగల విషయంలో మాత్రం ఇలాంటి పని చేయడం వ్యర్థం. మనం దాన్ని కొట్టేలోపే అది పారిపోతుంది కాబట్టి ఈగను కొట్టబోతే దెబ్బమిగిలేది మనకే. ఇది చాలా మందికి తెలిసిన విషయమే అయినా ఒక్కోసారి కోపంలో కొందరు ఈగను కూడా నలిపేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నం వికటిస్తే ఎంతటి ప్రమాదమో తెలిపే షాకింగ్ ఘటన తాజాగా చైనాలో వెలుగు చూసింది. తన ముఖం చుట్టూ ఎగురుతూ ఇబ్బందిపెట్టిన పురుగును చంపబోయిన ఓ వ్యక్తి ఏకంగా తన కంటినే పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఉదంతం సంచలనంగా (Viral) మారింది.

Viral: రెండేళ్ల క్రితం తిన్న మిరపకాయ ఎంత పని చేసిందీ! ఇతడి పరిస్థితి చూస్తే..


పూర్తి వివరాల్లోకి వెళితే, బాధితుడు చైనాలోని గ్వాండాంగ్ ప్రావిన్స్‌లో నివసిస్తుంటాడు. ఇటీవల ఓమారు అతడి కంటి చుట్టూ ఈగ ఎగురుతూ తెగ ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. ఎంతతోలినా పోవట్లేదనుకున్నాడో ఏమో కానీ అతడికి ఈగపై కోపం నషాళానికి అంటింది. దీంతో, ఈగ ముఖం మీద ఉన్నప్పుడే చంపేయాలనుకుని తనని తాను ఒక్కటిచ్చుకున్నాడు. ఈగ చనిపోయింది కానీ ఆ తరువాత సమస్య ఒక్కసారిగా ముదిరిపోయింది. ఈగ కన్నులో పడటంతో కన్నంతా ఎర్రగా మారిపోయింది. తనకు తోచిన మందులు ఏవో వేసుకున్నాడో కానీ సమస్య తీరలేదు. ఇన్ఫెక్షన్ రాను రాను ముదిరిపోవడంతో మందులకు కూడా లొంగని పరిస్థితి వచ్చేసింది. కంటి చూపు కూడా తగ్గిపోయింది.


అతడిని పరీక్షించిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ మెదడుకు కూడా వ్యాపించొచ్చని హెచ్చరించారు. కను గుడ్డు తొలగించక తప్పదని తేల్చి చెప్పారు. మరోదారి లేక బాధితుడు కూడా అంగీకరించడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా అతడి ఎడమకంటి గుడ్డును పూర్తిగా తొలగించేశారు.

కాగా, అతడి కంటిపై ఎగిరిన పురుగు సాధారణంగా తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తుందని వైద్యులు తెలిపారు. ఇవి నీళ్లల్లో గుడ్లు పెడతాయని, అందులోంచి బయటకొచ్చే లార్వాలు మళ్లీ పురుగులుగా మారతాయని చెప్పుకొచ్చారు. కాగా, సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్‌గా మారింది. ఇకపై ఈగలు, దోమలు మరేదైనా పురుగు ముఖం మీద వాలితే ఆవేశంగా చంపే ప్రయత్నం చేయమని కొందరు చెప్పుకొచ్చారు. పురుగుల్ని చంపితే ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయా అంటూ ఆశ్చర్యపోయారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 26 , 2024 | 03:45 PM