Viral: తల్లిదండ్రుల చిన్న పొరపాటు.. 20 ఏళ్ల పాటు యువకుడికి నరకం!
ABN , Publish Date - Dec 01 , 2024 | 06:37 PM
ఇరవై ఏళ్ల పాటు ముక్కులో డైస్ ఇరుక్కుపోయి అవస్త పడ్డ ఓ చైనా యువకుడికి ఇటీవలే సమస్య నుంచి విముక్తి లభించింది. వైద్యుల ఆపరేషన్ విజయవంతం కావడంతో అతడ కోలుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరవై ఏళ్ల పాటు ముక్కులో డైస్ ఇరుక్కుపోయి అవస్త పడ్డ ఓ చైనా యువకుడికి ఇటీవలే సమస్య నుంచి విముక్తి లభించింది. వైద్యుల ఆపరేషన్ విజయవంతం కావడంతో అతడ కోలుకున్నాడు (Viral).
షాంగ్జీ ప్రావిన్స్‌లోని జియాన్ ప్రాంతానికి చెందిన జియోమాకు ప్రస్తుతం 23 ఏళ్లు. అతడికి మూడేళ్లు ఉన్నప్పటి నుంచీ తరచూ తుమ్ములు, జలుబు వేధించేవి. నిరంతం తమ్ములు వస్తుండటంతో అతడు సతమతమయ్యేవాడు. సంప్రదాయిక చైనా వైద్య విధానాలు ఎన్ని ప్రయోగించినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. జియోమా పరిస్థితి అతడికే కాకుండా కుటుంబసభ్యులకూ ఇబ్బంది కరంగా మారింది.
Viral: ఊహించని ట్విస్ట్! భార్య కోసం రూ.3.4 లక్షల బంగారు నగలు కొంటే..
నెల రోజుల క్రితం పరిస్థితి మరింతగా ముదిరింది. నిరంతం తుమ్ములు వేధిస్తూ ఉండటంతో విసిగిపోయిన అతడు చివరకు వైద్యులను సంప్రదించాడు. అతడికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు ముక్కులోపలు ఉన్న డైస్‌ను చూసి ఆశ్చర్యపోయారు.
‘‘నేసల్ ఎండోస్కోపీ సందర్భంగా నాసినానాళం వెనక భాగంలో ఏదో తెల్లని వస్తువు ఉండటం గమనించాము. అది అక్కడి కండరాలకు అత్తుకుని ఉంది. రకరకాల ద్రవాలతో తడిసిపోయి ఉంది. ముక్కులోపలి పొరలు దెబ్బతినేలా చేస్తోంది’’ అని వైద్యులు తెలిపారు.
షాకింగ్! పెళ్లివేదికపై ఉన్న ఈ వరుడు ఫోన్‌లో ఏం చూస్తున్నాడో తెలిస్తే..
సమస్య పరిష్కరించేందుకు వైద్యులు శస్త్రచికిత్స ద్వారా దాన్ని జాగ్రత్తగా ముక్కులోంచి బయటకు తీశారు. డైస్‌ను బయటకు తీయడం కత్తిమీద సాములా మారిందని వైద్యులు పేర్కొన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ డైస్ మరింత లోపలకు జారి పోయి ఉండేదని, ఫలితంగా అతడికి ఊపిరాడని పరిస్థితి వచ్చేదని చెప్పారు. అయితే, వైద్యులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి దాన్ని బయటకు తీశారు.
20 ఏళ్ల పాటు డైస్ అతడి ముక్కులోనే ఉండిపోవడంతో ఏదైనా ఇతర సమస్యలు తలెత్తాయా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు. తనకు సుమారు మూడు నాలుగేళ్లు ఉన్నప్పుడు డైస్‌ను లోపల పెట్టుకుని ఉండొచ్చని యువకుడు మీడియాకు తెలిపాడు.
ఈ ఘటనను గుణపాఠంగా తీసుకోవాలని వైద్యులు అక్కడి ప్రజలను పత్రికాముఖంగా హెచ్చరించారు. ‘‘చిన్న పిల్లల పెంపకంలో అత్యంత జాగరూకతగా ఉండాలి. వెయ్యికళ్లతో వారిని గమనిస్తూ ఉండాలి. చిన్నారులు తెలీక ఇలాంటి చిన్న వస్తువులను ముక్కులో పెట్టుకుంటారు. చివరకు అది ప్రాణాంతకంగా మారొచ్చు. లేదా ఇతర అసాధారణ పరిస్థితులకు దారి తీయొచ్చు’’ అని యువకుడికి ఆపరేషన్ చేసిన వైద్యుడు ఒకరు హెచ్చరించారు.
Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!