Share News

Viral Video: రూపాయి ఖర్చు లేకుండా 10 నిమిషాల్లో చల్లటి నీరు.. ఫ్రిడ్జ్ కూడా అక్కర్లే

ABN , Publish Date - May 15 , 2024 | 05:32 PM

రిఫ్రిడ్జిరేటర్లు ఉపయోగించకుండా, కుండలు వాడకుండా నీటిని 10 నిమిషాల్లో కూల్‌గా మార్చే టెక్నిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా(Viral Video) మారింది. అది కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే.

Viral Video: రూపాయి ఖర్చు లేకుండా 10 నిమిషాల్లో చల్లటి నీరు.. ఫ్రిడ్జ్ కూడా అక్కర్లే

ఇంటర్నెట్ డెస్క్: అసలే వేసవి కాలం. చన్నీటికి బాగా డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం కొందరు ఫ్రీడ్జ్‌లు ఉపయోగిస్తారు. మరి కొందరు కుండ నీటిని వాడతారు. కానీ.. రిఫ్రిడ్జిరేటర్లు ఉపయోగించకుండా, కుండలు వాడకుండా నీటిని 10 నిమిషాల్లో కూల్‌గా మార్చే టెక్నిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా(Viral Video) మారింది. అది కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే.

దివ్య సిన్హా అనే మహిళ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లో వినూత్న వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఆమె ఇటీవలే ఓ వీడియోను పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. వేసవి కాలంలో అందరి దగ్గర ఫ్రిడ్జ్‌లు ఉండకపోవచ్చు.. మరి కొందరు కుండలు కొనుగోలు చేసే ఆసక్తి చూపకపోవచ్చు. అలాంటి వారి కోసం చల్లటి నీటిని క్షణాల్లో అందించే టెక్నిక్ చెబుతూ ఆమె వీడియో చేసింది.


నీటిని చల్లబరచడానికి బాటిళ్లకు గన్నీ సంచులు, బట్టలు చుట్టడం కామనే. అయితే ఇవి ఇంట్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో చల్లబడటానికి చాలా సమయం తీసుకుంటాయి. దీనికి పరిష్కారంగా తడిబట్టతో చుట్టిన బాటిళ్లను చెట్టు కొమ్మలకు కట్టేస్తే 10 నిమిషాల్లో నీరు చల్లబడుతుంది.

ఈ విషయాన్నే దివ్య తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది. ఆర్థిక స్థోమత లేనివారు ఈ టెక్నిక్‌తో వేసవి కాలాన్ని కూల్‌గా మార్చుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటివరకు 86 వేలకుపైగా లైక్‌లు పొందింది.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 15 , 2024 | 07:56 PM