Share News

Viral: వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

ABN , Publish Date - Sep 26 , 2024 | 08:42 PM

తమ పెళ్లి ఖర్చు మొత్తాన్ని అతిథుల నుంచి వసూలు చేసిన ఓ కిలాడీ వధూవరుల ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. స్నేహితులన్న ఆపేక్షతో వారి పెళ్లికి వెళ్లి రూ.2 లక్షలు కోల్పోయిన ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు.

Viral: వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

ఇంటర్నెట్ డెస్క్: తమ పెళ్లి ఖర్చు మొత్తాన్ని అతిథుల నుంచి వసూలు చేసిన ఓ కిలాడీ వధూవరుల ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. స్నేహితులన్న ఆపేక్షతో వారి పెళ్లికి వెళ్లి రూ.2 లక్షలు కోల్పోయిన ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. వారు చేసింది సబబేనా అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.

Viral: షాకింగ్..నవజాత శిశువుతో పాలసీసా శుభ్రం చేయించిన వైనం!


స్నేహితుల పెళ్లికి వెళ్లినందుకు తన జేబు ఎలా ఖాళీ అయ్యిందీ చెబుతూ జాక్ అనే వ్యక్తి రెడిట్‌లో పంచుకున్నాడు. సోఫీ, జెఫ్‌లతో తనకు చాలా కాలంగా స్నేహకంగా ఉందని తెలిపారు. తమ పెళ్లికి రావాలంటూ వారు ఈమెయిల్‌లో ఆహ్వానం పంపారని చెప్పారు. అయితే, ఈమెయిల్‌తో పాటు వచ్చిన ఓ లింక్‌‌ను క్లిక్ చేయాలన్న సూచన తనను ఆకర్షించిందని అతడు చెప్పాడు. దానిపై క్లిక్ చేసి చూస్తే రూ.2లక్షలు విరాళంగా ఇవ్వాలన్న అభ్యర్థన కనిపించిందన్నారు. వారు తన చిరకాల మిత్రులు కావడంతో మొహమాటం కొద్దీ ఆ మేరకు మొత్తం చెల్లించినట్టు జాక్ వివరించాడు.

Viral: భార్యకు స్కూటర్ యాక్సిడెంట్! తనపై తానే పోలీసు కేసు పెట్టుకున్న భర్త!


అయితే, పెళ్లికెళ్లాక మరింత షాక్ తగిలిందని అతడు చెప్పాడు. పెళ్లిలో భోజనం ఖర్చులు కూడా అతిథులే చెల్లించాలని పెళ్లివేదిక నిర్వాహకులు చెప్పడంతో తాను నోరెళ్లబెట్టానని అన్నాడు. భోజనం, ఇతర అల్పాహారాలు, డ్రింక్స్ వంటి వాటన్నిటికీ కలిపి మొత్తం రూ.25 వేలు అయినట్టు చెప్పాడు. అంత డబ్బు ఇచ్చుకోలేక తాను వారితో బేరసారాలు ఆడి కొంత తక్కువ ఇచ్చి అక్కడి నుంచి బయటపడ్డట్టు చెప్పాడు. పెళ్లి ఖర్చులో చాలా భాగాన్ని ఆ దంపతులు అతిథుల నుంచి రాబట్టుకున్నారని ఆ తరువాత తెలిసి అవాక్కయ్యానని వివరించాడు.

Viral: కెనడాలో రూ.1.2 కోట్ల శాలరీ! తమ సీక్రెట్ చెప్పేసిన ఎన్నారై దంపతులు!


ఈ ఉదంతం విన్న నెటిజన్లు షాకైపోయారు. పెళ్లికని పిలిచి ఇలా మోసపూరితంగా డబ్బు వసూలు చేయడం దారుణమని అనేక మంది అభిప్రాయపడ్డారు. వధూవరుల ధోరణి అనైతికమని మండిపడ్డారు. పెళ్లి ఖర్చును అతిథుల మీద రుద్దడం, వారు ఆర్థికభారంతో కుంగేలా చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. అనేక మంది ఆ నవదంపతులను ఈసడించుకున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది.

Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

Read Latest and Viral News

Updated Date - Sep 26 , 2024 | 08:42 PM