Share News

Viral Video: ఈ జంట క్రియేటివిటీకి సలాం కొట్టాల్సిందే.. రొమాంటిక్ ఫొటోషూట్ కోసం ఎలాంటి ట్రిక్ వాడారో చూడండి..!

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:52 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది క్రియేటివిటీకి రెక్కలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను ప్రదర్శించడానికి పూర్తి స్వేచ్ఛ ఉన్న వేదికగా మారింది. తమ ట్యాలెంట్‌ ప్రదర్శించి వ్యూస్, లైక్స్ రాబట్టి పాపులర్ అవడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Viral Video: ఈ జంట క్రియేటివిటీకి సలాం కొట్టాల్సిందే.. రొమాంటిక్ ఫొటోషూట్ కోసం ఎలాంటి ట్రిక్ వాడారో చూడండి..!
couple did this Jugaad for a romantic photoshoot

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది క్రియేటివిటీకి (Creativity) రెక్కలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను ప్రదర్శించడానికి పూర్తి స్వేచ్ఛ ఉన్న వేదికగా మారింది. తమ ట్యాలెంట్‌ ప్రదర్శించి వ్యూస్, లైక్స్ రాబట్టి పాపులర్ అవడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పిచ్చిలో పడి కొందరు అడ్డదారులు తొక్కుతుంటే మరి కొందరు మాత్రం తమ తెలివితేటలతో అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


ripon_deuri అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జంట రొమాంటిక్ ఫొటోషూట్ (photoshoot) కోసం ప్రత్యేక ట్రిక్‌ను అవలంభించింది. ఓ చిన్న వాటర్ బాటిల్ తీసుకుని దాని పైభాగంలో అనేక రంధ్రాలు చేసి దానిని నీటితో నింపారు. అబ్బాయి ఆ వాటర్ బాటిల్‌ను పైకెత్తి గట్టిగా నొక్కాడు. దీంతో వర్షం జల్లులా నీరు బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఓ రొమాంటిక్ ఫోజు పెట్టారు. ఈ నీటి బిందువులు వారిపై షవర్‌లా పడి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఏదో సినిమాలో రొమాంటిక్ సీన్‌లా కనిపిస్తోంది.


ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 10 కోట్ల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. 36 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి సీన్ రాదు``, ``క్రియేటివిటీ పీక్స్‌లో ఉంది``, ``నీటిని ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు అని నాలాంటి సింగిల్స్ బాధపడతారు``, ``వావ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: 10 సెకెన్లలో 3 దేశాలను చూసెయ్యొచ్చు.. ఆ నగరం ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!


Viral Video: ఈ వీడియో చూస్తే దడుచుకోవాల్సిందే.. తనను తానే తినేస్తున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్!

Picture Puzzle: మీ కళ్ల సామర్థ్యానికి టెస్ట్.. ఈ ఫొటోలోని భిన్నమైన యాపిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral News: రూ.33 వేల ఖరీదైన టీ-షర్ట్ వేసుకుని చెప్పే విషయం అదా? అన్ అకాడమీ సీఈవో గౌరవ్ ముంజల్‌పై ట్రోలింగ్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2024 | 03:43 PM