Share News

Viral: రెండేళ్లుగా బాయ్‌ఫ్రెండ్‌తో అద్దె ఫ్లాట్‌లో యువతి.. సీక్రెట్‌గా అతడు చేసేదేంటో తెలిసి..

ABN , Publish Date - May 19 , 2024 | 06:58 PM

బాయ్‌ఫ్రెండ్‌తో అద్దె ఫ్లాట్‌లో ఉంటున్న ఓ యువతి అది అతడి సొంతమని తెలీక సగం అద్దె చెల్లించసాగింది. రెండేళ్ల తరువాత ఈ విషయం బయటపడి చివరకు దిమ్మెరపోయింది. నెట్టింట ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Viral: రెండేళ్లుగా బాయ్‌ఫ్రెండ్‌తో అద్దె ఫ్లాట్‌లో యువతి.. సీక్రెట్‌గా అతడు చేసేదేంటో తెలిసి..

ఇంటర్నెట్ డెస్క్: ఈ సోషల్ మీడియా జమానాలో డేటింగ్ ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. నచ్చినవారికి ఖరీదైన బహుమతులు ఇవ్వలేక, షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేయించలేక అనేక మంది సింగిల్‌గా ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇక కలిసి ఉన్నా కూడా ఏదో విధంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రకరకాల ఉపాయాలు కూడా పన్నుతున్నారు. అయితే, డబ్బులు మిగిల్చుకునేందుకు ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌కు టోకరా కొట్టిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ (Viral) అవుతోంది. రెండేళ్ల తరువాత జరిగిన విషయం గురించి తెలిసి దిమ్మెరపోవడం గర్ల్‌ఫ్రెండ్ వంతైంది.

Viral: ఆకాశంలో అద్భుతం.. అసలైన ఉల్కాపాతం అంటే ఇదే.. చూసి తీరాల్సిన వీడియో!


పూర్తి వివరాల్లోకి వెళితే, ఓ యువకుడితో రిలేషన్‌షిప్‌లో ఉన్న యువతి అతడితో కలిసి ఓ అద్దె ఫ్లాట్‌లో ఉంటోంది. రెండేళ్లుగా అదే ఫ్లాట్‌లో ఉంటున్న వారు అద్దె మాత్రం చెరిసగం పంచుకుంటున్నారు. ఇటీవల ఆ యువతికి ఓ షాకింగ్ నిజం తెలిసింది. తాము అద్దెకు ఉంటున్న ఫ్లాట్ తన బాయ్‌ఫ్రెండ్‌దేనని తెలియడంతో ఆమె ఒక్కసారిగా దిమ్మెరపోయింది. బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేశాడో చేయలేదో తేల్చుకోలేక చివరకు బావురుమంది (Couple pays house rent together turns out flat belongs to boyfriend).

ఈ ఉదంతం నెట్టింట వైరల్ కావడంతో జనాలు కూడా పడీపడీ నవ్వుతున్నారు. వ్యాపారపరంగా చూస్తే అతడు చేసిన దాంట్లో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని చెబుతున్నారు. వ్యాపారసూత్రాలకు అనుగుణంగానే ఉందని చెప్పారు. నీకు ఇచ్చే గిఫ్టుల ఖర్చు భరించలేకే అతడు అలా చేసి ఉండొచ్చని కొందరు సరదా కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 19 , 2024 | 07:04 PM