Share News

Viral: వామ్మో.. కాకుల్లో ఇంతటి పగాప్రతీకారాలా? ఏకంగా 17 ఏళ్ల పాటు..

ABN , Publish Date - Nov 04 , 2024 | 09:34 PM

కాకులు మనుషుల చేసిన చెడును ఏకంగా 17 ఏళ్ల పాటు గుర్తుపెట్టుకోగలవని అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్ స్వానుభవంతో తెలుసుకున్నారు. అంతేకాకుండా.. తన అనుభవాన్ని అధ్యయనం రూపంలో ప్రచురించేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

Viral: వామ్మో.. కాకుల్లో ఇంతటి పగాప్రతీకారాలా? ఏకంగా 17 ఏళ్ల పాటు..

ఇంటర్నెట్ డెస్క్: కుండలో నీరు తాగేందుకు కాకి అందులోకి రాళ్లు వేసిన కథను మనందరి చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. కాకుల తెలివితేటలకు ఆశ్చర్యపోయాం. అయితే, ఇది కేవలం కథ మాత్రమే కాదని కాకులు నిజంగానే అతంటి టాలెంటెడ్ అని సైన్స్ ఎప్పుడో రుజువు చేసింది. అయితే, కాకుల పగ కూడా అదే రేంజ్లో ఉంటుందని కొన్నేళ్ల క్రితమే ఓ ప్రొఫెసర్ రుజువు కూడా చేశారు. తనపై కోపం పెంచుకున్న కాకులు 17 ఏళ్ల పాటు తనను గుర్తుపెట్టుకుని వెంటాడిన వైనాన్ని ఆయన తాజాగా పేర్కొన్నారు (Viral).

Viral: వామ్మో.. ఎవర్రా మీరంతా! రైల్లో బెర్త్‌ దొరకలేదని వీళ్లేం చేశారో చూస్తే..


యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ప్రొఫెసర్ జాన్ మార్‌జల్ఫ్ కాకుల్లో ప్రతీకారం రేంజ్ ఎంతటిదో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన ముఖానికి దయ్యం ముసుకు తొడుక్కుని ఏడు కాకులను పట్టుకుని ఓ బోనులో బంధించాడు. వాటిని వదిలిపెట్టిన తరువాత కూడా సులువుగా గుర్తించేందుకు రెక్కలపై కొన్ని ముద్రలు కూడా వేసి వాటిని వదిలిపెట్టేశాడు. అది మొదలు అవి ప్రొఫెసర్ వెంట పడటం మొదలెట్టాయి. ఇక క్యాంపస్‌లో ఉండగా తను మాస్కు పెట్టుకున్న ప్రతిసారీ అవి అరిచి గోల చేసేవి. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించేవి.

Viral: లాంగ్ జర్నీల్లో కారు ఎక్కగానే నిద్రలోకి జారుకుంటున్నారా? కారణం ఇదే!


ఇది చాలదన్నట్టు ఈ ఏడు కాకులకు తోడు ఇతర కాకులు కూడా చేరి ప్రొఫెసర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండేవి. అలా చాలా ఏళ్ల పాటు వాటి బెదడ కొనసాగింది. ఆయన కనిపించినప్పుడల్లా కాకులు తమ తోటి పక్షులను అలర్ట్ చేస్తున్నట్టు గోల చేసేవి. కానీ 2013 తరువాత క్రమంలో వాటి హడావుడి తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. ఇక గతేడాది సెప్టెంబర్‌లో ఆయన యథాప్రకారం, మాస్కు పెట్టుకుని క్యాంపస్‌లోకి వచ్చినా కాకులు ఆయనను గుర్తించలేదు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించలేదు. దీంతో, ఆయన కాకులు తనను ఇన్నేళ్ల పాటు గుర్తుపెట్టుకున్నందుకు ఆశ్చర్యపోయారు. దీన్ని ఓ అధ్యయనంగా సైంటిఫిక్ జర్నల్స్‌లో ప్రచురించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు.

Read Latest and Health News

Updated Date - Nov 04 , 2024 | 09:34 PM