Share News

Viral: రూ.4.2 కోట్ల ఆదాయం! తన సక్సెస్ ఫార్ములా చెప్పిన యువకుడిపై జనాల ఫైర్

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:05 PM

కలలు సాకారం చేసుకోవాలంటే నిద్రను త్యాగం చేయాలంటూ ఓ యువకుడు పెట్టిన పోస్టుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి జీవితం వారిదని, ఒకరి లక్ష్యాలను మరొకరిపై రుద్ద కూడదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Viral: రూ.4.2 కోట్ల ఆదాయం! తన సక్సెస్ ఫార్ములా చెప్పిన యువకుడిపై జనాల ఫైర్

ఇంటర్నెట్ డెస్క్: నేటి యువతలో అనేక మార్పులు వస్తున్నాయి. తమకేం కావాలో వారికి స్పష్టంగా తెలుసు. డబ్బే పరమావధి కాదని, నచ్చినట్టు జీవించడమే అసలైన విజయమని అనేక మంది నమ్ముతున్నారు. ఆ ప్రకారమే లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. విజయానికి కొలమానం డబ్బే అన్న వారికి దీటుగా జవాబిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా మరో ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఏటా రూ.4.2 కోట్లు సంపాదిస్తూ తన విజయం రహస్యం ఏంటో చెప్పిన ఓ యువకుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తడంతో కంగుతిన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: వారెవ్వా.. పనిమనిషికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి..!


కుషాల్ అరోరా అనే 23 ఏళ్ల ఆంత్రప్రెన్యూర్ తన సక్సెస్ ఫార్ములాను నెట్టింట షేర్ చేశాడు. ‘‘నాకు 23 ఏళ్లు, ఏటా 5 లక్షల డాలర్లకు పైనే ఆర్జిస్తున్నా. నేను చదువుకునే రోజుల్లో స్టూడెంట్లు పార్టీలు, ఎంజాయ్‌మెంట్ అంటూ తిరుగుతుంటే నేను మాత్రం పనితో కుస్తీ పడుతూ నిద్రలేని రాత్రులు గడిపా. పంగడలు, గెట్ టూ గెదర్‌లు వంటి కార్యక్రమాలను కాదనుకున్నా. వైఫల్యాన్ని, తిరస్కారాన్ని చవిచూశా. వ్యక్తిగత జీవితం వృత్తిగత జీవితం మధ్య సమతౌల్యం లేకుండా గడిపేశా’’ అంటూ తన సక్సెస్ ఫార్ములాను వివరించాడా యువ బిజినెస్‌మ్యాన్. మరి మీరూ మీ కలలను సాకారం చేసుకుంటున్నారా? అని నెటిజన్లను ఉద్దేశిస్తూ ఓ పోస్టు పెట్టాడు.

Viral: జర్మనీలో ఈ ఎన్నారైలు ఏం చేశారో చూడండి.. నెట్టింట తిట్ల వర్షం!


విద్యార్థులు, యువతలో స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ పోస్టుపై జనాల నుంచి ఊహించని స్పందన వచ్చింది. డబ్బే పరమావధి అన్న భావన వ్యాప్తి చేస్తున్నాడంటూ నెటిజన్లు అతడిపై దుమ్మెత్తిపోశారు. ‘‘నీ జీవితం నీది, వాళ్ల జీవితం వాళ్లది. అందరూ జీవితంలో కోట్లు సంపాదించాలని అనుకోరు. నీవేదో ఘనకార్యం చేసినట్టు డప్పు కొట్టుకోకు. కష్టపడి పనిచేశావు.. డబ్బు సంపాదించుకున్నావ్.. ఇక నచ్చినట్టు బతుకు. అంతేకానీ, నీ అంత సంపాదన లేని యువతపై అనవసర ఒత్తిడి తీసుకురాకు’’ ఓ వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘‘నేను ఆ వయసులో ఉన్నప్పుడు తెగ ఎంజాయ్ చేశా.. ఇప్పుడు నీకంటే ఎక్కువే సంపాదిస్తున్నా. నేను చెప్పేదేంటంటే.. ఒక విధానం నీకు కలిసొచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ అదే ఫలితం వస్తుందన్న రూలేమీ లేదు. మరో ఉదాహరణ ఏంటంటే.. టీమిండియాలో చోటు కోసం లక్షల మంది కష్టపడుతుంటారు. కానీ కేవలం 11 మందికే చోటు దక్కుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

Viral: ఈ బస్సు డ్రైవర్ గ్రేట్.. అందరూ ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలే జరగవు!

Read Latest and Viral News

Updated Date - Oct 20 , 2024 | 03:08 PM