Share News

Viral Video: కట్టలు తెంచుకున్న అంకుల్ ఆగ్రహం..

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:34 PM

ఢిల్లీ మెట్రోలో రోజుకో డ్రామా జరుగుతుంది. గొడవలు, డ్యాన్స్ చేయడం.. ఇలా రోజుకో డ్రామా జరుగుతూనే ఉంటుంది. ఒతకను అంకుల్ పర్స్ దొంగలించే ప్రయత్నం చేశాడు. దొంగిలించే సమయంలో అంకుల్ పట్టుకున్నాడు. ఇంకేముంది ఆ దొంగ పని అయిపోయింది. అతనిపై విచక్షణరహితంగా దాడి చేయడం ప్రారంభించాడు.

Viral Video: కట్టలు తెంచుకున్న అంకుల్ ఆగ్రహం..
Uncle Attack

ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) రోజుకో డ్రామా జరుగుతుంది. గొడవలు, డ్యాన్స్ చేయడం.. ఇలా రోజుకో డ్రామా జరుగుతూనే ఉంటుంది. ఒతకను అంకుల్ పర్స్ దొంగలించే ప్రయత్నం చేశాడు. దొంగిలించే సమయంలో అంకుల్ పట్టుకున్నాడు. ఇంకేముంది ఆ దొంగ పని అయిపోయింది. అతనిపై విచక్షణరహితంగా దాడి చేయడం ప్రారంభించాడు. ఆ వీడియోను సోషల్ మీడియా ఎక్స్‌లో ఘార్ కే కలేష్ పేరుతో షేర్ చేశారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.


వీడియో తీస్తూ..

మెట్రోలో ట్రావెల్ చేయగా ఓ మిడిల్ ఏజ్ పర్సన్ జేబు నుంచి ఒకతను పర్స్ దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు. అలర్ట్ అయిన అతను యువకుడిని పట్టుకున్నాడు. తనలో ఉన్న కోపం మొత్తం తీశాడు. చెంపపై కొట్టాడు. భుజాలపై చేయి చేసుకున్నాడు. తన్నాడు. అతడిని కొడుతుండగా ఇతర ప్రయాణికులు నిల్చొని ఉన్నారు. మరికొందరు వీడియో తీశారు.


Viral Video: కండక్టర్ దూకుడు.. స్టూడెంట్‌పై..!!

అంకుల్ జీ కొట్టొద్దు

తనను కొట్టొద్దని యువకుడు పదే పదే ప్రాధేయ పడ్డాడు. కానీ ఏ మాత్రం జాలి చేపలేదు. పాదాలపై పడి క్షమించమని వేడుకున్న ఫలితం లేదు. ‘అంకుల్ జీ నన్ను క్షమించండి. మరోసారి ఇలా జరగనివ్వ. మీరు ఇలాగే కొడితే నేను చనిపోతా అని’ యువకుడు అర్థించాడు. అయినప్పటికీ అంకుల్ కొట్టడం ఆపలేదు. మరింత ఎక్కువ అటాక్ చేశారు.


పోలీసులకు అప్పగిస్తే

ఆ దొరికిన దొంగను పోలీసులకు అప్పగిస్తే బాగుండేదని చాలామంది అభిప్రాయ పడ్డారు. అతను దొంగతనం చేశాడు. క్షమాపణ చెప్పారు. అతనిపై ఇలా దాడి చేయడం సరికాదు. పోలీసులకు హ్యండొవర్ చేస్తే బాగుండేది. ఒక వ్యక్తిని విచక్షణరహితంగా కొట్టే హక్కు ఎవరికీ లేదని ఓ యూజర్ రాసుకొచ్చారు. దొంగతనం చేయడం తప్పు.. ఇది ఎవరికి మంచిది కాదు. దొంగతనం చేసిన అతడిని కొట్టడం కూడా మానవత్వం అనిపించుకోదని మరొకరు కామెంట్ చేశారు. ఓ వ్యక్తిని అంతలా కొట్టడం సరికాదని ఇంకొకరు రాశారు. అంకుల్ జీ సాఫ్ట్ పర్సన్ ఒకరు సెటైర్స్ వేయగా.. బెల్ట్ ట్రీట్ మెంట్ అని మరొకరు రాసుకొచ్చారు. ఆ వీడియోకు ఇప్పటికే 470కే వ్యూస్ వచ్చాయి.


Read Latest
Viral News and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 05:34 PM