Home » Metro News
మెట్రోరైళ్లకు సంబంధించి కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా.. మెట్రోరైళ్ల తలుపుల్లో బట్టలు, బ్యాగులు ఇరుక్కుపోకుండా కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టనున్నట్లు చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) అధికారులు తెలిపారు.
ఓల్డ్‌సిటీ మెట్రో పనులపై టెన్షన్ మొదలైంది. కారిడార్‌లో చేపడుతున్న 7.5 కిలోమీటర్ల పనుల్లో ఉన్నటువంటి వారసత్వ కట్టడాలపై మెట్రో ప్రభావం ఎంత ఉంటుందో తెలిపేలా హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదని, పనులను తక్షణమే ఆపాలని యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ రహీమ్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ (హెచ్ఏఎంఎల్) అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న మెట్రో కారిడార్-6 పనులు ఆపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, మెట్రోరైల్ ఎం.డి. తదితరులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగా పలు కారిడార్లలో అంచనా వ్యయం భారీగా పెరిగింది. రాయదుర్గం-కోకాపేట్ మార్గంలో కిలోమీటరుకు సగటున రూ.372 కోట్లు వ్యయం కానున్నట్లు సమాచారం.
హైదరాబాద్ ట్రాఫిక్ జామ్.. నత్తను తలపించే వేగం..! ఈ పరిస్థితికి మెట్రోరైల్ కొంత వరకు చెక్ పెట్టినా.. ఐటీ కారిడార్‌లో మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు చేరుకోవడం గగనంగా మారే పరిస్థితి..!
హైదరాబాద్ మహానగరానికి ఔటర్ రింగు రోడ్డు మణిహారంగా మారింది. ఔటర్ కేంద్రంగా అభివృద్ధి దూసుకెళ్తోంది. నివాస ప్రాంతాలే కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థలు ఔటర్ రింగు రోడ్డుతో అనుసంధానమవుతున్నాయి. తాజాగా మెట్రో కారిడార్ కూడా విస్తరిస్తోంది.
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఓల్డ్‌సిటీ వాసులు మెట్రో రైలు కోసం మద్దతు పలుకుతున్నారు. తమ ప్రాంతంలో మెట్రో కలను నెరవేర్చుకోవడంలో భాగంగా ఆస్తులను ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు.
పాతబస్తీ(Old City)లో మెట్రో నిర్మాణానికి అవసరమైన క్షేత్రస్థాయి పనులను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్), రెవెన్యూ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు.
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో రూ.2 వేల కోట్ల వ్యయంతో రోడ్డు కమ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది.