Share News

Viral: పార్సిల్‌తో చిట్టీనీ వదిలి వెళ్లిన డెలివరీ ఏజెంట్! అది చదివిన మహిళ..

ABN , Publish Date - Jun 30 , 2024 | 09:11 PM

తన పెళ్లి కోసం డబ్బులు కూడ బెడుతున్నానని చెప్పిన ఓ డెలివరీ ఏజెంట్ టిప్ ఇవ్వాలంటూ ఓ చిట్టీ ద్వారా కోరడం నెట్టింట వైరల్ అవుతోంది. అతడి మంచిమనసుకు మెచ్చిన నెటిజన్లు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు.

Viral: పార్సిల్‌తో చిట్టీనీ వదిలి వెళ్లిన డెలివరీ ఏజెంట్! అది చదివిన మహిళ..

ఇంటర్నెట్ డెస్క్: డెలివరీ ఏజెంట్ల పుణ్యమా అన్నీ ఇంటివద్దకే వచ్చి చేరుతున్నాయి. నగర జీవితం మరింత సౌకర్యవంతం చేయడంలో ఏజెంట్ల పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎండా, వానా అనే తేడా లేకుండా సమయానికి వస్తువులను ఏజెంట్లు ఎంతో కష్టానికోర్చి డెలివరీ చేస్తుంటారు. ఇలాగే కష్టపడుతున్న ఓ ఏజెంట్ తన కస్టమర్‌ కోసం ఓ చిన్న చిట్టీ వదిలి వెళారు. అది చదివి ముచ్చటపడ్డ మహిళ ఈ ఉదంతాన్ని నెట్టింట (Viral) పంచుకుంది. ఇది నెటిజన్లకు కూడా నచ్చి వారు రంగంలోకి దిగడంతో అతడి చిరకాల కోరిక తీరింది.

Viral: ఇలా తయ్యారయ్యారేంట్రా.. ఇంతకంటే డేంజరస్ ప్రాంక్ వీడియో ఉంటుందా!


పూర్తి వివరాల్లోకి వెళితే, ఫీనిక్స్‌కు (అమెరికా) చెందిన ఎరికా హెర్నాండెజ్ ఇటీవల ఆన్‌లైన్‌లో ఏదో వస్తువు ఆర్డరిచ్చింది. అది తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ ఓ చిట్టీ కూడా వదిలివెళ్లాడు. తాను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు అతడు చెప్పాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు పెళ్లివేడుక మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో పార్ట్‌టైంగా పార్శిల్స్ డెలివరీ చేస్తూ డబ్బులు కూడబెడుతున్నట్టు చెప్పాడు. ఆమె కోరుకున్నట్టు తమ వివాహాన్ని ఖర్చులకు వెనకాడకుండా జరుపుకోవాలన్నదే తన ఉద్దేశమని అన్నారు. కాబట్టి, తోచినంత మేరకు టిప్ ఇవ్వాలని కోరాడు.

ఇది చదివిన మహిళ డెలివరీ ఏజెంట్ మంచి మనసుకు ముచ్చటపడింది. వెంటనే ఆ నోట్‌ను నెట్టింట పంచుకోవడంతో జనాలు కూడా అతడికి ప్రేయసి పట్ల ఉన్న ప్రేమకు ముచ్చటపడ్డారు. భారీగా విరాళాలు గుప్పించారు. తన ఉదంతం వైరల్ అయ్యి, నలుదిశల నుంచి ఆర్థికసాయం అందుతుండటంతో డెలివరీ ఏజెంట్ సంబరానికి అంతేలేకుండా పోయింది.

Read Viral and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 09:14 PM