Viral Video: డైరెక్ట్‌గా పాతాళ లోకానికే డెలివరీ.. రోడ్డు అడుగు నుంచి జేసీబీ ఏం బయటకు తీసిందే తెలిస్తే..
ABN , Publish Date - Sep 07 , 2024 | 06:06 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే రోడ్లు ఈ వర్షాల కారణంగా మరింత ధ్వంసమై పాదచారులకు, వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. చాలా రాష్ట్రాలు వరదలతో (Floods) అతలాకుతలమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే రోడ్లు (Roads) ఈ వర్షాల కారణంగా మరింత ధ్వంసమై పాదచారులకు, వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా గుర్గావ్‌లో (Gurgaon) ఓ డెలివరీ బాయ్ (Delivery boy) తన బైక్‌తో సహా ఏడు అడుగుల గుంతలో పడిపోయాడు. ఆ బైక్ (Bike)ను బయటకు తీసేందుకు జేసీబీ (JCB) రావాల్సి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@RohitSi70785609 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న ఓ యువ డెలివరీ ఏజెంట్ ఈ లోతైన గొయ్యిలో పడిపోయాడు. అతడు సురక్షితంగా బయటపడ్డాడు. చుట్టుపక్కల వారు అతడిని కాపాడారు. అయితే అతడి బైక్‌ను బయటకు తీయడానికి జేసీబీ రావాల్సి వచ్చింది. కొద్ది సేపు ప్రయత్నించి ఆ గొయ్యి నుంచి బైక్‌ను బయటకు తీసింది. గుర్గావ్‌లోని బసాయి రోడ్డులో ఇలాంటి ప్రమాదకర ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఇది అత్యంత ఘోరం``, ``డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే రోడ్లు ఎంతో కాలం నిలవవు``, ``మెయిన్ రోడ్డులోనే పరిస్థితి ఇది``, ``గుర్గావ్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి``, ``హర్యానా ఇంజినీర్ల పనితనం ఇది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: కోతికి కోపమొచ్చింది.. కత్తి తీసుకుని యజమాని పైనే దాడికి దిగింది.. వీడియో వైరల్..
Optical Illusion: ఈ పజిల్‌ను కేవలం 1 శాతం మందే పరిష్కరించగలిగారు.. ఈ ఫొటోలోని పులిని కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి