Share News

Viral Video: కోతికి కోపమొచ్చింది.. కత్తి తీసుకుని యజమాని పైనే దాడికి దిగింది.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:37 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉండి నవ్వుతెప్పిస్తాయి. మరికొన్ని ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటాయి.

Viral Video: కోతికి కోపమొచ్చింది.. కత్తి తీసుకుని యజమాని పైనే దాడికి దిగింది.. వీడియో వైరల్..
monkey

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉండి నవ్వుతెప్పిస్తాయి. మరికొన్ని ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఓ కోతి (Monkey)కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా కోతులను గారడీ చేసే వారు (juggler) తమ సంపాదన కోసం ఉపయోగించుకుంటుంటారు (Viral Video).


గారడీ చేసే వారి ఆదేశాల మేరకు కోతులు రకరకాల విన్యాసాలు చేసి ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. గారడీ చేసే వ్యక్తి పైనే కోతి దాడి చేయడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. గారడీ చేసే సమయంలో ఎందుకో తీవ్ర ఆగ్రహానికి గురైన కోతి ఓ కత్తి తీసుకుని తన యాజమాని వైపు దూసుకెళ్లింది. అతడికి కత్తి చూపిస్తూ బెదిరించింది. ఆ కోతి కోపాన్ని చూసిన చుట్టు ఉన్న వారు అక్కడి నుంచి పారిపోవాలని ఆ గారడీ వాడికి సూచిస్తూ కేకలు వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. దాదాపు 46 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ కోతి కేవలం భయపెడుతోంది``, ``ఇది కూడా గారడీలో ఒక ట్రిక్కు``, ``ఆ కోతి యాక్టింగ్ అదిరిపోయింది``, ``కోతికి కత్తి దొరికితే ప్రమాదం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral: గాళ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కు వెళ్లేందుకు పెయిడ్ లీవ్.. థాయ్ కంపెనీ వినూత్న ఆలోచన.. కారణమేంటంటే..


Optical Illusion: ఈ పజిల్‌ను కేవలం 1 శాతం మందే పరిష్కరించగలిగారు.. ఈ ఫొటోలోని పులిని కనిపెట్టండి..


Viral Video: తెలివి ఉండాలే గానీ, కారే కావాలా, ఏంటి? వీళ్లు తయారు చేసిన స్కూటర్ చూస్తే నివ్వెరపోవాల్సిందే..


Viral Video: వార్నీ.. ఈ బాలుడికి ధైర్యం ఎక్కువే.. పులితో ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 07 , 2024 | 05:37 PM