Viral: జర్మనీలో ఈ ఎన్నారైలు ఏం చేశారో చూడండి.. నెట్టింట తిట్ల వర్షం!
ABN , Publish Date - Oct 19 , 2024 | 09:01 PM
జర్మనీలోని ఓ ప్రజారవాణా బస్సులో కొందరు ఎన్నారైలు గనాబజానాకు తెరలేపడం సంచలనంగా మారింది. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తూ దేశం పరువు తీస్తున్నారని కొందరు భారతీయులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా బస్సులు, ఇతర రవాణా సాధనాల్లో స్నేహితులంతా కలిసి వెళుతుంటారు. అలాంటి సందర్భాల్లో అంత్యాక్షరి గట్రా ఆడుకుంటూ టైం పాస్ చేస్తారు. చాలా మందికి ఇందులో తప్పు తోచేది ఏమీ ఉండదు. కానీ విదేశాల్లో, పబ్లిక్ ప్రయాణించే ప్రజారవాణా బస్సుల్లో పాటలు పాడటం సబబేనా? అంటే దీనిపై ప్రస్తుతం నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జర్మనీలోని ఓ పబ్లిక్ బస్సులో కొందరు ఎన్నారైలు పెద్దపెట్టున్న పాటలు పాడుతున్నారంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: ఈ బస్సు డ్రైవర్ గ్రేట్.. అందరూ ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలే జరగవు!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు ఎన్నారైలు ప్రజారవాణా బస్సులో పాటలకు తెరలేపారు. అందరూ కలిసి పెద్ద గొంతుతో మూకుమ్మడిగా పాడటం ప్రారంభించారు. చప్పట్లు చరుస్తూ గోల చేశారు. అదే బస్సులో కొందరు శ్వేతజాతీయులు ఉన్నారు. ఎన్నారైలు ఇలా పాటలు పాడుతుంటే వారంతా మౌనంగా చూస్తుండిపోయారు.
కాగా, ఎన్నారైల తీరుపై కొందరు నెట్టింట తీవ్ర విమర్శలు గుప్పించారు. వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘‘ఇది జర్మనీలోని ఓ ప్రభుత్వ రవాణా బస్సులో జరిగినట్టు తెలుస్తోంది. అక్కడున్న స్థానికులకు చిరాకెత్తి వీళ్లను దేశం నుంచి వెళ్లగొట్టాలని ఆశిస్తున్నా. జర్మనీ అధికారులు దీనిపై చర్చలు తీసుకోనప్పటికీ వీళ్లకు ఈ పోస్టు చేరాలని కోరుకుంటున్నారు. ఈ పోస్టుకు వచ్చే రిప్లైలు చూసైనా జనాలు వీళ్లను ఎంతగా ఈసడించుకుంటున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.
Viral: ఇండియాకు రానా? అంటూ ఎన్నారై ప్రశ్న! రావద్దంటూ నెటిజన్ల గగ్గోలు!
ఈ వీడియోను చూసిన భారతీయులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పద్ధతులు, సంస్కృతిని గౌరవించాలని హితవు పలికారు. ‘‘విదేశీయులు స్థానిక సంస్కృతి, పద్ధతులను గౌరవించాలి. ప్రజా రవాణా సాధనాల్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ఎలాంటి పనులు చేయకూడదు’’ ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి చర్యల వల్ల భారతీయులపై విదేశాల్లో తప్పుడు అభిప్రాయాలు కలుగుతాయని కొందరు అన్నారు. ‘‘విదేశాల్లో మన పరువు మంటకలిపేసే ఏ అవకాశాన్నీ వీళ్లు వదిలిపెట్టరు. మనం బలవంతంగా రుద్దుతున్న హిందీ విషయంలోనూ దక్షిణాది వాళ్లు ఇలాగే ఫీలవుతుంటారు అని మరో వ్యక్తి అన్నాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Viral: ఇంత టాలెంటెడ్‌గా ఉంటే జాబ్ ఇవ్వము! యువతికి షాకిచ్చిన గూగుల్!