Share News

Bike Safety Tips: ఈ తప్పులు చేయకండి.. యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోండి

ABN , Publish Date - May 19 , 2024 | 05:21 PM

అనేక మంది రోడ్డుపై బైక్(bike) నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల(mistakes) వల్ల తరుచుగా ప్రమాదాలు(accidents) జరుగుతున్నాయి. అలా జరిగే ప్రమాదం పలు మార్లు పెద్దది కాగా, మరికొన్ని సార్లు చిన్న యాక్సిడెంట్‌తో తప్పిపోతుంది. అయితే బైకర్లు డ్రైవింగ్ చేసే క్రమంలో చిన్న తప్పులు చేయకుండా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఇప్పుడు చుద్దాం.

Bike Safety Tips: ఈ తప్పులు చేయకండి.. యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోండి
avoid these mistakes bike accidents

అనేక మంది రోడ్డుపై బైక్(bike) నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల(mistakes) వల్ల తరుచుగా ప్రమాదాలు(accidents) జరుగుతున్నాయి. అలా జరిగే ప్రమాదం పలు మార్లు పెద్దది కాగా, మరికొన్ని సార్లు చిన్న యాక్సిడెంట్‌తో తప్పిపోతుంది. అయితే బైకర్లు డ్రైవింగ్ చేసే క్రమంలో చిన్న తప్పులు చేయకుండా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఇప్పుడు చుద్దాం.

  • బైక్‌ను ప్రాంతాన్ని బట్టి పరిమిత వేగంతో నడపాలి. గల్లీలలో కూడా వేగంతో డ్రైవ్ చేయకూడదు

  • రోడ్డు మీద బైక్ నడిపే ముందు ఎప్పుడూ తాగకూడదు. ఇలా చేయడం ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది

  • రహదారిపై ట్రాఫిక్ నిబంధనల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఉల్లంఘిస్తే మీకు ఫైన్ పడి, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది

  • రహదారిపై ట్రాఫిక్ రెడ్ లైట్లను పలు సమయాల్లో దాటుకుని వెళ్లొద్దు. లేకుంటే అటువైపు నుంచి వచ్చే వాహనాలను ఢీకొనే అవకాశం ఉంటుంది

  • చాలా మంది సమయాన్ని ఆదా చేయడానికి వ్యతిరేక దిశలో డ్రైవ్ చేస్తారు. కానీ అలా చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ

  • బైక్ రైడింగ్ సమయంలో బూట్ల లేస్‌లు కట్టుకుని డ్రైవ్ చేయాలి, లేదంటే గేర్‌లను మార్చే సమయంలో అవి బ్రేక్ లివర్‌లో చిక్కుకుపోయి ప్రమాదానికి దారితీస్తాయి

  • మీరు బైక్ నడుపుతున్నప్పుడు మీ దృష్టి ఎల్లప్పుడూ రోడ్డుపైనే ఉండాలి. మరోచోట గానీ, స్పీడో మీటర్ గానీ చూస్తే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది

  • మీరు మూలను తీసుకునే సమయంలో బైక్ వేగాన్ని తగ్గించి, సౌండ్ చేస్తూ ముందుకు వెళ్లాలి. లేదంటే ఎదురుగా వచ్చే బైక్ బ్యాలెన్స్ కోల్పోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

  • మీరు మరో బైక్ లేదా ఇతర వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముందు గేర్‌ని మార్చి ఓవర్ టేక్ చేయాలి.

  • కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల మధ్యలో ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

  • బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌బడ్‌లు ధరించి డ్రైవ్ చేయోద్దు. ఎందుకంటే ఆకస్మాత్తుగా వెనుక నుంచి ఎవరైనా హారన్ కొట్టినా సౌండ్ వినపడకుంటే ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది

  • బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి. దీని ద్వారా బైక్ నుంచి కిందపడినా కూడా తలకు గాయాలు కాకుండా కాపాడుకోవచ్చు

ఇది కూడా చదవండి:

EMI Bounced: మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి

ఎఫ్‌ అండ్‌ ఓ పెట్టుబడులపై జాగ్రత్త!

Read Viral and Telugu News

Updated Date - May 19 , 2024 | 05:37 PM