Share News

Viral: భారీ వర్షం, ట్రాఫిక్ జామ్‌‌లో చిక్కుకుని ఫుడ్ ఆర్డరిస్తే..

ABN , Publish Date - Sep 08 , 2024 | 01:33 PM

జోరు వాన కారణంగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయిన ఓ కస్టమర్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరిచ్చి డెలివరీ ఏజెంట్‌ను కష్టాలపాలు చేసిన వైనం చర్చనీయాంశమవుతుంది.

Viral: భారీ వర్షం, ట్రాఫిక్ జామ్‌‌లో చిక్కుకుని ఫుడ్ ఆర్డరిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: జోరు వాన కారణంగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయిన ఓ కస్టమర్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరిచ్చి డెలివరీ ఏజెంట్‌ను కష్టాలపాలు చేసిన వైనం చర్చనీయాంశమవుతుంది. ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోను చూసిన జనాలు.. సదరు కస్టమర్‌పై మండిపడుతున్నారు. ఇది నిజంగా అమానవీయమంటూ తిట్టిపోస్తున్నారు (Viral).

Viral: వైద్యురాలి దారుణం! కూతురితో పేషెంట్ పుర్రెకు రంధ్రం చేయించిన వైనం


ఢిల్లీలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వానలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన ఓ కస్టమర్‌ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరిచ్చాడు. అయితే, ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న తన కారు లొకేషన్‌ను అడ్రస్‌గా చేర్చాడు. అయితే, ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన ఆ ఏజెంట్.. కస్టమర్ కారు ఎక్కడుందో తెలీక తెగ ఇబ్బంది పడ్డాడు. చేతిలో ఫుడ్ పార్శిల్‌తో జోరు వానలో తడుస్తూ అతడు కస్టమర్‌ కోసం వెతుకుతున్న తీరును అదే రోడ్డు మీదున్న మరో వ్యక్తి రికార్డు చేసి నెట్టింట పంచుకోవడం వైరల్‌గా మారింది. కస్టమర్ కారులో హ్యాపీగా కూర్చుంటే డెలివరీ ఏజెంట్ మాత్రం వానలో తడుస్తూ అడ్రస్ కోసం ఇబ్బంది పడటం జనాలను కలిచి వేసింది.


నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఏకంగా రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. జనాలు మాత్రం ఆ కస్టమర్‌నే తిట్టిపోస్తున్నారు. డెలివరీ ఏజెంట్‌ను ఇబ్బంది పడేలా లొకేషన్ పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇది నిజంగా అమానవీయం, ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిందే, అంత వానలో ట్రాఫిక్‌లో ఉండగా ఆర్డర్లు పెట్టొచ్చా?’’ అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. మానవ జీవితానికి విలువే లేకుండా పోయింది’’ అని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. మరికొందరు మాత్రం డెలివరీ ఏజెంట్‌పై ప్రశంసలు కురిపించారు. అంతటి వానలో కూడా వృత్తిపట్ల నిబద్ధతతో ఆహారం డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న అతడి జీతం కచ్చితంగా పెంచాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 08 , 2024 | 01:33 PM