Share News

Viral: చావు ముంగిట వ్యూహం మార్చిన పాము.. ఊపిరాడక గెద్ద ఉక్కిరిబిక్కిరి..షాకింగ్ వీడియో

ABN , Publish Date - May 21 , 2024 | 07:14 PM

తనను చంపబోయిన గెద్దను ఊహించని విధంగా ఉక్కిరిబిక్కిర చేసిన పాము వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చివరి నిమిషంలో పాము వ్యూహం మార్చి పైచేయి సాధించిన వైనం జనాలను నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

Viral: చావు ముంగిట వ్యూహం మార్చిన పాము.. ఊపిరాడక గెద్ద ఉక్కిరిబిక్కిరి..షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో అసాధ్యమన్నది ఏదీ లేదు. ఏ నిమిషంలో ఏమైనా జరగొచ్చు. అంతా మన అదుపులోనే ఉందనుకుంటుండగా పరిస్థితి తలకిందులై ప్రాణాల మీదకు రావచ్చు. ఓ గెద్ద విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. పాము తన నోటికి చిక్కడంతో ఆహారం దొరికిందనుకున్న గెద్ద ఊహించని విధంగా ప్రాణాపాయ స్థితిలో పడింది. ఊపిరాడక, కాలు కదపలేక ఉక్కిరిబిక్కిరయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. వీడియోలో గెద్ద పరిస్థితిని చూసి జనాలు అవాక్కవుతున్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ గెద్ద నేల మీద ఉన్న పామును తలపై తొక్కిపెట్టి కదలకుండా చేసింది. తన పదునైన ముక్కుతో కొంచెం కొంచెం పీక్కు తినడం ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితిలో సాధారణంగా ఏ పాము ప్రాణమైనా గాల్లో కలిసిపోవాల్సిందే. గెద్దకు ఆహారమై పోవాల్సిందే. కానీ, ఇక్కడ మాత్రం పరిస్థితి అనూహ్యంగా తలకిందులైంది.

Viral: సముద్రంపై డేగను తలదన్నేలా గాల్లో ఎగురుతున్న చేప.. అబ్బురపరిచే వీడియో!


గెద్ద వెంటనే చంపకపోవడంతో పాము కాస్తంత తేరుకుని వ్యూహం మార్చింది. గెద్ద, పాము తల భాగాన్ని మాత్రమే పట్టుకోవడంతో మిగతా భాగంతో పాము గెద్ద మెడ చుట్టూ గట్టిగా చుట్టుకుంది. మెల్లగా పట్టుబిగించింది. దీంతో, మెడ వెనక్కు వాల్చేసిన గెద్ద ఊపిరాడక వెల్లకిలా పడి ఉక్కిరిబిక్కిరయ్యింది. పామును వదిలేసి పారిపోదామన్నా దానికి కుదరలేదు. పాము గట్టిగా దాన్ని చుట్టుకోవడంతో ఎటూ కదలలేక విలవిల్లాడిపోయింది. అయితే, వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందీ తెలియరాలేదు (Eagle trying to feed on snake gets strangulated watch how situation alters).

ఇక వీడియో చూసిన జనాల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. మల్లయోధుల్లాగా చివరి నిమిషంలో పాము తన ప్రత్యర్థిని బంధించి ఉక్కిరిబిక్కిరి చేసిందని కొందరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం గెద్ద తప్పు చేసిందని అన్నారు. పామును వెంటనే చంపకపోవడంతో దానికి కొత్త వ్యూహం పన్నే అవకాశం దక్కిందని కామెంట్ చేశారు. ఓడలుబళ్లవడం అంటే ఇదేనేమో అని కొందరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Read Viral and Telugu News

Updated Date - May 21 , 2024 | 07:21 PM