Share News

Viral: మాజీ పోర్న్ స్టార్ కోసం కర్వాచౌత్ ఉపవాసం.. వృద్ధుడి అరాచకం!

ABN , Publish Date - Oct 22 , 2024 | 07:00 PM

మాజీ పోర్న్ స్టార్ కోసం కర్వా చౌత్ వ్రతం ఆచరించిన ఓ వృద్ధుడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోపై కొందరు సరదా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Viral: మాజీ పోర్న్ స్టార్ కోసం కర్వాచౌత్ ఉపవాసం.. వృద్ధుడి అరాచకం!

ఇంటర్నెట్ డెస్క్: తమ భర్తలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మహిళలు జరుపుకునేదే కర్వా చౌత్ వేడుక. ఉత్తరాది వారు ఆచరించే ఈ సంప్రదాయంలో మహిళలు రోజంతా తమ భర్తల కోసం ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రదర్శనం తరువాత దీక్ష విరమించి భోజనం చేస్తారు. భార్యాభర్తల బంధానికి ప్రతీకగా నిలుస్తున్న కర్వా చౌత్ వ్రతాన్ని ఓ వృద్ధుడు ఓ మాజీ పోర్న్ స్టార్ కోసం ఆచరించాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు విస్తుపోయేలా చేస్తోంది (Viral).

Viral: ఉద్యోగులే మా సెలబ్రిటీలన్న కంపెనీ! ఎలాంటి దీపావళి గిఫ్ట్ ఇచ్చిందంటే..


వైరల్ వీడియోలో కనిపించిన దాని ప్రకారం, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా కోసం ఓ వృద్ధుడు కర్వా చౌత్ ఆచరించాడు. రోజంతా ఉపవాసం ఉండి దీక్ష విరమిస్తున్నట్టుగా జల్లెడలోంచి చంద్రదర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత జల్లెడ లోంచి మీయా ఖలీఫా ఫొటోను చూశాడు. అత్యంత భక్తిశ్రద్ధలతో అతడు ఈ వ్రతం ఆచరిస్తున్నట్టు వీడియోలో పోజిచ్చాడు.

వీడియో చూసిన కొందరు నవ్వుకున్నా అత్యధికులు మాత్రం వృద్ధుడిపై మండిపడ్డారు. జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. ‘‘మియా ఖలీఫా కోసం కర్వా చౌత్ వ్రతమా..అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతోంది’’ అని ఓ వ్యక్తి గగ్గోలు పెట్టాడు. మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ఇలాంటి పండుగలతో హాస్యాలు మంచివి కావని కొందరు హితవు పలికారు. మరికొందరు మాత్రం సరదా కామెంట్స్ చేశారు. వృద్ధుడి వ్రతం తరువాత మీయా ఖలీఖా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉంటుందని చెప్పుకొచ్చారు.


Viral: బాయ్‌ఫ్రెండ్‌కు కోట్ల ఆస్తి వారసత్వంగా రానుందని తెలిసి హత్య! చివరకు..

మరో ఘటనలో, ఓ మహిళ కర్వా చౌత్‌ రోజునే భర్తపై విషప్రయోగం చేసింది. కర్వా చౌత్‌లో భాగంగా రోజంతా ఉపవాసం ఉన్న ఆమెకు సాయంత్రం భర్తతో గొడవ జరిగింది. ఆ తరువాత వారి వివాదం సద్దుమణిగినా కూడా రాత్రి భోజనంలో భర్తకు విషం కలిపిపెట్టింది. మరో రెండు రోజులకు అతడు మరణించాడు. తన చావుకు భార్య విషప్రయోగమే కారణమని ఆసుపత్రి బెడ్‌పై మరణ వాంగ్మూలం ఇచ్చి కన్నుమూశాడు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పెను కలకలానికి దారి తీసింది. భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే భార్య ఈ ఘాతుకానికి తెగబడిందని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

Read Latest and Viral News

Updated Date - Oct 22 , 2024 | 07:05 PM