Viral: తాత పుట్టిన రోజున ఒంటరిగా బామ్మ.. మనవడి ఊహించని సర్ప్రైజ్!
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:50 PM
భర్త పోవడంతో ఒంటరైన ఓ వృద్ధురాలికి ఆమె మనవడు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చాడు. భర్త పుట్టిన రోజు ఆమె ఒంటరిగా రెస్టారెంట్‌కు వెళితే అతడు వచ్చి ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. మనవడు సడెన్‌గా ఇలా రావడంతో ఆ వృద్ధురాలు ఆశ్చర్యపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులు, కడుపున పుట్టిన వారి తరువాత అతంటి గాఢ అనుబంధం ఉండేది జీవిత భాగస్వామితోనే! ఇక జీవితాంతం వెన్నంటే ఉన్న భార్య లేదా భర్త దూరమైతే ఆ లోటు పూడ్చటం అసాధ్యం. ముఖ్యంగా పెద్దవయసులో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు మరింత ఒంటరితనం అనుభవిస్తారు. అలాంటి వారికి కుటుంబసభ్యుల అండ ఎంతో అవసరం. అయితే ఓ యువకుడు తన బామ్మ పట్ల ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. భర్త పుట్టిన రోజున ఒంటరిగా ఉన్న ఆమెకు అతడిచ్చిన సర్ప్రైజ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (Viral).
Viral: జెప్టో, బ్లింకిట్ యాప్‌లకు కొబ్బరి బొండాల షాపు యజమాని ఛాలెంజ్!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వృద్ధురాలికి భర్త పోయి చాలా కాలమే అయ్యింది. ఆమెకు సంతానంతో పాటు మనవలు మనవరాళ్లు కూడా ఉన్నారు. అయితే, ఇటీవల తన భర్త పుట్టిన రోజును ఆమె సెలబ్రేట్ చేసుకునేందుకు ఒంటరిగానే రెస్టారెంట్‌కు వెళ్లింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఆమె మనవడు వృద్ధురాలికి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. ఇక రెస్టారెంట్లో వృద్ధురాలు ఒంటరిగా కూర్చుని ఉండగా అతడు అక్కడికి వెళ్లాడు. మనవడిని చూడగానే వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. భర్త పుట్టిన రోజును ఒంటరిగా జరుపుకోవాల్సిన వస్తోందని విచారంలో ఉండగా మనవడి రాక ఆమెను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తింది. దీంతో, ఆమె నోరెళ్లబెట్టేసింది. అతడు ఆమెకు పుష్పగుచ్ఛం ఇవ్వడంతో పాటు తాను ఫొటోను కూడా ఇచ్చాడు. దీంతో, ఆమె ఆనందంతో కళ్లుచమరుస్తుండగా మనవడిని ఆప్యాయంగా కౌగిలించుకుంది.
Viral: కూతురి రూపురేఖలు చూసి తండ్రికి డౌట్! డీఎన్ఏ టెస్టు చేయిస్తే..
వీడియోలో ఇదంతా చూసిన జనాలు కూడా వారి బంధం చూసి మురిసిపోతున్నారు. వృద్ధులకు మనవలను చూస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదని కామెంట్ చేశారు. ఇక బామ్మను సర్ప్రైజ్ చేసేందుకు అతడు ఏకంగా 11 గంటల పాటు కారులో జర్నీ చేసి అక్కడికి వచ్చారని తెలిసి జనాలు మరింత ఆశ్చర్యపోయారు. పెద్దలపట్ల అతడికున్న ప్రేమాభిమానాలకు ముగ్ధులయ్యారు. యువకుడు మంచి మనసున్న వాడని, వృద్ధురాలికి ఈ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ వీడియోకు ఏకంగా లక్ష వరకూ లైకులు, అంతకు మించి వ్యూస్ వచ్చాయంటే జనాలను ఈ ఉదంతం ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
Viral: వామ్మో.. జూలో జింకకు ఎంత తెలివో చూడండి!