Viral: ఈ ఏనుగుకు ఎంత మర్యాద! తన దారికి అడ్డుగా నిలబడ్డ వ్యక్తిని..
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:51 PM
తన దారికి అడ్డుగా నిలబడ్డ ఓ వ్యక్తిని ఏనుగు అత్యంత మర్యాదగా పక్కకు తప్పుకోమని సైగ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకయ్యేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: సంఘజీవి అయిన మనిషి సాటి వ్యక్తులతో కలిసి జీవించేందుకు వీలుగా కొన్ని కట్టుబాట్లు విధించుకున్నాడు. తోటి వారికి మర్యాద ఇవ్వడం, అవసరంలో ఉన్న వారికి సాయపడటం, ఇతరులతో ఇబ్బంది కలిగినప్పుడు మర్యాదగా ఆ విషయాన్ని చెప్పడం వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. కానీ జంతువుల్లో ఇలాంటివి దాదాపుగా ఉండవనే చెప్పాలి. ఆహారం మొదలు అన్ని విషయాల్లో తోటి జీవాలతో పోటీ పడుతుంటాయి. అవసరమైతే దాడి చేసి మరీ తమకు కావాల్సింది దక్కించుకుంటాయి. అయితే, ఓ ఏనుగు ఇందుకు భిన్నంగా వ్యవహరించడం ప్రస్తుతం జనాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).
Viral: 43 ఏళ్లల్లో 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు! ఎందుకంటే..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి రోడ్డుపై ఎటో చూస్తూ నిలబడిపోయాడు. అదే రోడ్డుపై ఓ ఏనుగు నిశ్శబ్దంగా నడుచుకుంటూ వస్తోంది. ఏనుగు తనను సమీపిస్తున్నా అతడు గమనించలేదు. ఈలోపు ఏనుగు ప్రశాంతంగా అతడికి దగ్గరగా వచ్చేసింది. ఆ తరువాత కాలితో నేలపై దుమ్మును అతడివైపు తోస్తూ దారి ఇవ్వమన్నట్టు అప్రమత్తం చేసింది. ఒక్కసారిగా తన చుట్టూ దుమ్ము రేగడంతో ఏం జరుగుతోందో అర్థంకాక వ్యక్తి వెనక్కు తిరిగి చూస్తే భారీ ఏనుగు కనిపించింది. దీంతో, అతడు కంగారుగా పక్కకు పరిగెత్తుతూ వచ్చేశాడు. అతడు అలా పక్కకు తప్పుకోగానే ఏనుగు తన దారిన తాను నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇలా ఎలాంటి కోపం ప్రదర్శించకుండా ఏనుగు అతడిని తప్పుకోమని సైగలతో చెప్పిన తీరు అనేక మందిని ఆకట్టుకుంది.
Viral: మరో మహిళ భర్త కోసం రూ.1.39 కోట్లు చెల్లించి.. చివరకు రిఫండ్ కోసం పట్టు
వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. పక్కకు తప్పుకోమంటూ ఏనుగు అతడికి ఎంత మర్యాదగా చెప్పిందో అంటూ కొందరు మురిసిపోయారు. ఇంతటి మర్యాద తెలిసిన ఏనుగును మరెక్కడా చూడలేదని కొందరు అన్నారు. మనషులకంటే ఈ ఏనుగు అనేక రెట్లు బెటరని కొందరు కామెంట్ చేశారు. గుంపులుగా నివసించే ఏనుగుల్లో భావోద్వేగాలు కూడా దాదాపు మనుషులను పోలినట్టు ఉంటాయని కొందరు చెప్పుకొచ్చారు. తోటి ఏనుగులతో స్నేహం, బంధాలు అన్నీ మనుషులను గుర్తుకు తెస్తాయని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ ట్రెండవుతోంది.
Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!
Viral: అందంగా ఉన్నందుకు పార్టీకి రావద్దంటూ నిషేధం! మహిళకు షాకింగ్ అనుభవం