Share News

Viral: గాఢ నిద్రలో కుక్క.. ఏనుగు వస్తున్నా లెక్క చేయలేదు.. చివరకు..

ABN , Publish Date - May 17 , 2024 | 07:11 PM

తన దారిలో నిద్రిస్తున్న ఓ కుక్క అకస్మాత్తుగా లేవడం చూసి ఉలిక్కిపడ్డ ఓ ఏనుగు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: గాఢ నిద్రలో కుక్క.. ఏనుగు వస్తున్నా లెక్క చేయలేదు.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: భారీ శరీరాలతో భీకరంగా కనిపించే ఏనుగులు సాధారణంగా ఎంతో మృదుస్వభావులని వాటిని దగ్గర నుంచి చూసిన వారు చెబుతారు. మరీ తిక్కరేగితే తప్ప అవి ఇతర జీవాలను హానీ చేయాలని చూడవు. ఇది చాలదన్నట్టు.. వాటికి కూడా లోలోపల చెప్పలేనంత భయం ఉంటుంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ కోణం బయటపడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఇందులో ఏనుగు ప్రవర్తించిన తీరు ముద్దొచ్చేలా ఉండటంతో నెటిజన్లు ఏనుగును చూసి మురిసిపోతున్నారు. సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Viral: నాలుగు కాళ్లున్న పామును ఎప్పుడైనా చూశారా? షాకింగ్ వీడియో!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ కుక్క గాఢ నిద్రలో ఉండగా ఓ పెంపుడు ఏనుగు అటు వైపు నడుచుకుంటూ వెళ్లింది. దారిలో ఉన్న కుక్కను అది గమనించలేదు. ఏనుగు చప్పుడు వస్తున్నా కుక్క కూడా త్వరగా మేలుకోలేదు. అయితే, ఏనుగు తనకు బాగా దగ్గరకు వచ్చేసరికి కుక్క హఠాత్తుగా మేలుకుంది. అప్పటిదాకా ఏమరపాటుగా ఉన్న ఏనుగు కుక్క అకస్మాత్తుగా లేవడంతో ఉలిక్కిపడింది. భయపడుతూ చటుక్కున రెండు అడుగులు వెనక్కు వేసింది. ఇదంతా చూడటానికి ముచ్చటగొలిపేలా ఉండటంతో వీడియో బాగా వైరల్ అవుతోంది. (Elephants reaction as she bumps into sleeping dog is such a sweet moment).

ఆ ఏనుగు పేరు లానా అని దానికి తొమ్మిదేళ్లు అని వీడియోలోని మహిళ చెప్పింది. దాన్ని తాము పెంచుకుంటున్నామన్న ఆమె.. లానా చాలా మృదుస్వభావి అని చెప్పింది. లానాకు కుక్కలంటే భయమని కూడా చెప్పింది. కుక్కను చూసి ఉలిక్కిపడ్డాక అది ధైర్యం కోసం తనవైపు పరిగెత్తుకుంటూ వచ్చిందని చెప్పింది. ఇక ఈ వీడియో జనాలకు విపరీతంగా నచ్చింది. ఏనుగు తీరు చూసి అనేక మంది ముచ్చట పడ్డారు. ఏనుగులు సహజసిద్ధంగా శాంతస్వభావులనీ, మృదుస్వభావులని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - May 17 , 2024 | 07:16 PM