Viral: బాస్ రియాక్షన్‌కు కన్నీటిపర్యంతమైన యువతి! రాజీనామా చేస్తున్నానని చెబితే..
ABN , Publish Date - Nov 22 , 2024 | 10:30 PM
ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న తనకు బాస్ కొండంత అండగా నిలవడంతో ఓ యువతి కన్నీటి పర్యంతమైంది. మా బాస్ నిజంగా గ్రేట్ అంటూ తన వీడియో కాల్ తాలూకు దృశ్యాల్ని నెట్టింట పంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనవడం సహజం. అప్పటివరకూ అండగా నిలిచిన సహోద్యోగులకు, బాస్‌కు విడ్కోలు పలకాల్సిన సమయం అది. ముఖ్యంగా బాస్ శ్రేయోభిలాషిగా, సహోద్యోగులు స్నేహితులుగా మారిన చోటును వీడటం ఎవరికైనా కష్టమే. ఓ యువతి సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. తాను రాజీనామా చేస్తున్నట్టు ఆ ఉద్యోగి చెప్పగానే బాస్ రియాక్ట్ అయిన వైనం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగి శ్రేయస్సును నిండుమనస్సుతో కాంక్షించిన ఆ బాస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి (viral).
Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..
సిమ్రన్ అనే యువతి ఈ వీడియోను షేర్ చేసింది. ‘‘ఈ పోస్టు షేర్ చేస్తూ నేను ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నా. కానీ మా బాస్ ఎంత గొప్ప వ్యక్తో చెప్పడానికే ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఆమె లాంటి మరో వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. కార్యాలయాల్లో ఓ మంచి బాస్‌తో ఎంతటి సానుకూల వాతావారణం ఏర్పడుతుందో చెప్పడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నా’’ అని ఆమె చెప్పుకొచ్చింది.
Viral: బ్రిటన్‌లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరైన భారతీయ యువతికి షాకింగ్ అనుభవం!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ యువతి వీడియో కాన్ఫరెన్స్‌లో తన రాజీనామా విషయాన్ని బాస్‌కు చెప్పింది. తనకు మరో జాబ్ దొరికిందని తెలిపింది. ఇది వినగానే బాస్ ఎంతో సానుకూలంగా రియాక్టయ్యారు. యువతికి నిండుమనసుతో శుభాకాంక్షలు తెలిపారు. దీంతో, యువతి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. వీడియో కాల్‌లోనే కన్నీటి పర్యంతమైంది. యువతిని ఊరడించిన బాస్.. ఇలాంటి సమయాల్లో భావోద్వేగానికి లోనవడం సహజమేనని ఊరడించింది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించింది.
కాగా, ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. కార్పొరేట్ మేనేజర్ల ట్రెయినింగ్ కోర్సులో ఈ వీడియో భాగం చేయాలని కొందరు అన్నారు. ‘‘ఈ మేనేజర్ నిజంగా గ్రేట్. ఎక్కడా హెచ్ ఆర్ ప్రస్తావన తేలేదు. ఉద్యోగినికి అన్ని విధాలా అండగా నిలిచింది. నిజంగా గ్రేట్’’ అని మరో వ్యక్తి అన్నారు. ఇలాంటి మేనేజర్ ఉంటే ప్రతి ఉద్యోగి హ్యాపీగా ఫీలవుతారని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండ్ అవుతోంది.
Viral: దేవుడా! తను వాడిన కాటన్ బడ్స్ అమ్ముతూ భారీగా ఆర్జిస్తున్న మహిళ
Viral: భార్యను కలిసేందుకు 4.4 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర! ఇదో విచిత్ర ప్రేమ కథ!