Share News

Viral: వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఇది.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్

ABN , Publish Date - Jul 12 , 2024 | 06:43 PM

కొత్త వ్యాపారావకాశాలు ఎలా వస్తాయో సోదాహరణంగా చెబుతూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఇదేనన్న ఆయన సూచనతో నెటిజన్లు ఏకీభవిస్తున్నారు.

Viral: వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఇది.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్

ఇంటర్నెట్ డెస్క్: కొత్త వ్యాపారావకాశాలు ఎలా వస్తాయో సోదాహరణంగా చెబుతూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఇదేనన్న ఆయన సూచనతో నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. భారత్ అగ్రీ సంస్థ సీఈఓ సిద్ధార్థ్ దయలానీకి ఎదురైన అనుభవాన్ని ఆయన షేర్ చేశారు.

Viral: మనుషుల్లో ఇంత శాడిజమా! ఆకలితో ఉన్న హిప్పో ఆశగా నోరు తెరిస్తే..

గతంలో ఓసారి సిద్ధార్థ దయలానీ తన సంస్థలో టార్చ్ లైట్ల అమ్మకాలు అధికంగా ఉండటం, వాటిని రైతులు కొనుగోలు చేయడం గుర్తించారు. తన సంస్థ మార్కెటింగ్ టీంతో ఆరా తీయిస్తే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రుళ్లు కరెంట్ లేని కారణంగా తాము టార్చ్‌లు ఎక్కువగా వాడుతున్నామని వారు చెప్పారు. అయితే, అవి నిత్యం చేతిలో పట్టుకోవాల్సి రావడం తమ పనులకు ఇబ్బందిగా మారిందన్నారు. దీంతో, విషయం అర్థం చేసుకున్న సీఈఓ ఈసారి నెత్తికి తగిలించుకునే మైనింగ్ టార్చ్‌లైట్లు తమ సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చారు. దీంతో, వాటి అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి (Entrepreneurs Post Impresses Anand Mahindra This Is An Object Lesson ).


ఈ ఉదంతంపై స్పందించిన ఆనంద్ మహీంద్రా దయలానీ వ్యాపార మెళకువలను మెచ్చుకున్నారు. కస్టమర్ల అవసరాలను అన్ని వేళలా ఉత్పత్తిదారులు గుర్తించలేరని, అలాంటప్పుడు ప్రజల అభిరుచుల్లో వస్తున్న మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ వాటిల్లో వ్యా్ప్యారావకాశాలను దర్శించగలగాలంటూ కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 06:46 PM