Share News

Viral: ఏటా రూ.2 కోట్ల శాలరీ వదులుకున్న యువతి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే..

ABN , Publish Date - Jul 14 , 2024 | 08:50 PM

ఏటా రూ.2 కోట్ల ఆదాయం ఇచ్చే కార్పొరేట్ జాబ్ వదులుకుని యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ఓ యువతి చివరకు ఏటా రూ.8 కోట్లా ఆదాయం ఆర్జించే స్థాయికి ఎదిగింది.

Viral: ఏటా రూ.2 కోట్ల శాలరీ వదులుకున్న యువతి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా లండన్‌లో ఉద్యోగం. ఏటా రూ. 2 కోట్ల శాలరీ. ఇవేవీ నిషా షాకు సంతృప్తిని ఇవ్వలేదు. చివరకు ఊహించని విధంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. కొన్ని నెలలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాక ఆమె ఛానల్ హిట్టైంది. సంపాదన ఏటా రూ.8 కోట్లకు చేరుకుంది. అసలు ఇదంతా ఏలా సాధ్యమైందో ఆమె ఇటీవల వివరించింది. ఇది సంచలనంగా (Viral) మారింది.

లండన్‌లోని క్రెడిట్ అగ్రీకోల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా చేసే నిషాకు ఆ ఉద్యోగం అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. అసలా ఉద్యోగం తన సామర్థ్యాలకు పరీక్ష పెట్టేందుకు తగదని ఆమె భావించింది. కాబట్టి, ఆర్థికరంగంపై తనకున్న అవగాహనతో ఇతరులకు సాయపడుతూనే తనూ ఆర్థికభద్రత సాధించాలనుకున్న ఆమె యూట్యూబ్ ప్రారంభించింది (Ex Investment Banker Turns YouTuber Earns 8 Crore A Year ).

Viral: వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఇది.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్


ఛానల్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఆమెకు వ్యూస్ అంతంతమాత్రం గానే వచ్చాయి. వెయ్యి మంది సబ్‌స్క్రైబర్స్ చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 11 నెలలు పట్టింది. ఆ తరువాత ఆమె తాను ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకర్ ఎలా అయ్యిందీ, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేసిందీ చెబుతూ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక్కసారిగా సబ్‌స్క్రైబర్ల సంఖ్య 50 వేలకు చేరుకుంది. ఆ తరువాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పనే లేకపోయింది.

యూట్యూబ్ మానెటైజేషన్‌తో పాటు పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు, ఉత్పత్తుల అమ్మకాలు, కార్పొరేట్ టాక్స్, వివిధ బ్రాండ్స్‌తో పార్టనర్ షిప్ వెరసి ఆమెకు మంచి ఆదాయం అందింది. ఉద్యోగం కూడా మానేసి యూట్యూబ్ ఛానల్ దిగడం తనకు బాగా కలిసి వచ్చిందని ఆమె చెప్పింది. పూర్తి ఏకాగ్రతతో చేయడంతో సక్సెస్ త్వరగా అందిందని వెల్లడించింది. పర్సనల్ ఫైనాన్స్‌లో మంచి సలహాలు ఇస్తున్న ఆమె వ్యూవర్ల దృష్టిలో విశ్వసనీయ కంటెంట్ క్రియేటర్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 08:54 PM