Share News

Viral: అసలైన మనుషులంటే వీళ్లే.. కుక్క కోసం ఎంత రిస్క్ చేశారో చూడండి!

ABN , Publish Date - Jun 14 , 2024 | 04:10 PM

కాలవలో చిక్కుకున్న కుక్కను కాపాడేందుకు కొందరు చేసిన సాహసానికి చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నిజమైన మనుషులంటే వీరే అంటూ జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral: అసలైన మనుషులంటే వీళ్లే.. కుక్క కోసం ఎంత రిస్క్ చేశారో చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: స్వార్థమే పరమావధిగా అనేక మంది బతికేస్తున్నారు. దయాగుణం, మంచి మనసు ఉన్న వారే కరువైపోతున్న కాలం వచ్చిపడింది. వాస్తవానికి తోటి వారిపై జాలి, దయ లేకపోతే మానవ జీవితం నిరర్ధకమే. కానీ, మంచి మనుషులు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారని చెప్పే ఓ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. వీడియో పాతదే అయినా మానవత్వపు గొప్ప తనాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ఈ వీడియో మరోసారి నెట్టింట ట్రెండింగ్ లోకి (Viral) వచ్చింది.

Viral: కొండచిలువతో కలిసి మెట్రోలో ప్రయాణం! షాకింగ్ వీడియో!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రిజర్వాయర్ కాలవలో చిక్కుకున్న ఓ శునకాన్ని కాపాడేందుకు కొందరు మానవతా మూర్తులు తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఆపన్న హస్తం అందించారు. కొన్ని అడుగుల దిగువన కాలువలో ఉన్న కుక్కను చేరేందుకు జారుడు బల్లలా ఉన్న కాలవగట్టుపై వారు జారి పోకుండా ఒకరి చేయి మరొకరు పట్టుకుని కిందకు దిగారు. ఆ తరువాత కుక్కను జాగ్రత్తగా పైకి తీసుకొచ్చారు. చివరకు అందరూ ఎటువంటి అపాయం లేకుండా ఒడ్డుకు చేరుకున్నారు (Faith In Humanity Restored Group Of People Rescue Dog Stuck In Water Reservoir).

ఇక వీడియోలో ఇదంతా చూసి జనాలు ఆ మానవతా మూర్తులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అపాయంలో ఉన్న కుక్కను కాపాడేందుకు అంత రిస్క్ చేస్తున్న వీళ్లే అసలైన మనుషులని కొందరు కామెంట్ చేశారు. మనుషులు ఐకమత్యంతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో వైరల్ అవుతోంది. మనసును తాకుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Viral and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 04:10 PM