Share News

Viral Video: గుర్రమెక్కిన పిల్లోడు.. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా..

ABN , Publish Date - Nov 12 , 2024 | 07:43 PM

ఈ వీడియో చూస్తే ఎవరికైనా ముందుగా ఏమనిపిస్తుంది. ఎవరో వివాహం చేసుకోవడానికి.. పెళ్లి వేదిక వద్దకు గుర్రంపై వెళ్తున్నట్లుగా ఉందనిపిస్తుంది. కానీ గుర్రంపై యువకుడు ఉంటే అంతా అలానే అనుకునే వారు. కానీ ఓ బాలుడు ఉన్నాడు. దీంతో ఓ సందేహం అయితే అందరికి వస్తుంది.

Viral Video: గుర్రమెక్కిన పిల్లోడు.. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా..

పిల్లలను తొలి రోజు స్కూల్‌కి తీసుకు వెళ్లలాంటే.. ఏ తల్లిదండ్రులు అయినా ఏం చేస్తారు. పలక, బలపం బ్యాగ్‌లో పెట్టుకుని తమ పిల్లలను స్కూల్‌కు తీసుకు వెళ్తారు. సామాన్యులైతే ఆటోలో.. మధ్య తరగతి వారు అయితే బైక్‌పై.. ఇక స్థితిమంతులైతే కారు మీద తీసుకు వెళ్తారు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం విభిన్నంగా ఆలోచించారు. తమ కుమారుడిని స్కూల్‌కు వెరైటీగా తీసుకు వెళ్లాని భావించారు. అది కూడా కుమారుడు కావడంతో.. రేపు బాగా చదవి ఉన్నత స్థితికి రావాలని వారు ఆకాంక్షించారు. ఆ క్రమంలో అతడిని చాలా గ్రాండ్‌గా స్కూల్‌కు తీసుకు వెళ్లారు.

Also Read: Attack on Collector: రౌడీయిజం, గుండాయిజం చేస్తే.. తాట తీస్తాం


అది కూడా ఎంత గ్రాండ్‌గా అంటే.. గుర్రాన్ని అలంకరించారు. దాని మీద బాలుడిని కూర్చోబెట్టారు. బాజాభజంత్రిలు మోగిస్తున్నారు. ఆ బాలుడు కూర్చున్న గుర్రం చుట్టు బంధువులు చేరారు. ఒక మహిళ అయితే.. గుర్రం మీద కూర్చున్న ఆ బాలుడిపై పూవ్వులు, చమ్కీలు జల్లుతుంది. ఇక ఆ బాలుడు కూర్చున్న గుర్రం చుట్టూ.. బంధువులు పెద్ద ఎత్తున చేరారు. అంతేకాదు.. గుర్రం మీద నుంచి కింద పడకుండా ఉండేందుకు ఆ బాలుడికి జాగ్రత్తలు సైతం సూచిస్తున్నారు.

Also Read: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

Also Read: కాబూలీ శనగలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ వీడియో వీక్షిస్తే.. ఇది ఉత్తర భారతదేశంలోని చోటు చేసుకున్నదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని వారు అయితేనే ఈ విధంగా చేస్తారని వారు వివరిస్తున్నారు. మాములుగా ఈ వీడియోను చూస్తే.. గుర్రంపై పెళ్లి కొడుకు ఉన్నాడనుకున్నట్లుగా ఉందన్నారు.

Also Read: Attack on Collector: వికారాబాద్ ఘటనపై ఏడీజీ కీలక నివేదిక

Also Read: ఐఏఎస్ ప్రశాంత్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం


కానీ పరీక్షగా చూస్తేనే కానీ గుర్రంపై బాలుడు ఉన్నట్లుగా అవగతమవుతుందని చెబుతున్నారు. ఏదీ ఏమైనా ఈ బాలుడు మాత్రం చాలా లక్కీ అని వారు వివరిస్తున్నారు. ఈ పిల్లవాడు స్కూల్‌కు వెళ్లేటప్పుడే అతడి తల్లిదండ్రులు ఇంతగా హంగామా చేస్తున్నారని పేర్కొంటున్నారు. రేపు భవిష్యత్తులో అతడి ఉన్నత స్థితికి వెళ్లితే మాత్రం ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు మాత్రం ఉండవని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

For Viral News And Telugu News..

Updated Date - Nov 12 , 2024 | 07:43 PM