Share News

Bengaluru: మెట్రో సిబ్బంది అత్యుత్సాహం.. ట్రైన్ ఎక్కడానికి వచ్చిన రైతుని ఏం చేశారంటే

ABN , Publish Date - Feb 26 , 2024 | 06:32 PM

అధికారుల అత్యుత్సాహం ఓ రైతును అవమానానికి గురి చేసింది. సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే బెంగళూరు(Bengaluru)లో ఈ ఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన ఓ రైతు తన బ్యాగ్‌తో రాజాజీనగర్ మెట్రో స్టేషన్లో మెట్రో ఎక్కడానికి వెళ్లాడు.

Bengaluru: మెట్రో సిబ్బంది అత్యుత్సాహం.. ట్రైన్ ఎక్కడానికి వచ్చిన రైతుని ఏం చేశారంటే

బెంగుళూరు: అధికారుల అత్యుత్సాహం ఓ రైతును అవమానానికి గురి చేసింది. సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే బెంగళూరు(Bengaluru)లో ఈ ఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన ఓ రైతు తన బ్యాగ్‌తో రాజాజీనగర్ మెట్రో స్టేషన్లో మెట్రో ఎక్కడానికి వెళ్లాడు. ఆయన టికెట్ తీసుకున్న అనంతరం సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు రాగానే రైతును భద్రతా సిబ్బంది నిలిపేశారు. మెట్రో ఎక్కడానికి అనుమతించలేదు. తెల్ల చొక్కా ధరించి, తలపై బట్టల మూటతో ఉండటంతో ఆయన మెట్రోలో ప్రయాణించడానికి వీల్లేదని సిబ్బంది అడ్డుకున్నారు. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశాడు.

రైతును అడ్డుకోవడంపై కార్తిక్ అనే వ్యక్తి మెట్రో సిబ్బందిని ప్రశ్నించాడు. చివరికి రైతు మెట్రో ఎక్కడానికి అనుమతించారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటజన్లు మెట్రో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పందించిన మెట్రో యాజమాన్యం రైతును అడ్డుకున్న సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాజాజీనగర్ ఘటనపై దర్యాప్తు జరిగుతోందని.. సిబ్బందిలో ఒకరిని విధుల నుంచి తొలగించినట్లు చెప్పింది. రైతుకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 06:33 PM