Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:07 PM
మధ్య తరగతి వారికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందంటూ ఓ తండ్రి నెట్టింట ఆవేదన వ్యక్తం చేశాడు. తన కూతురిని చేర్పించాలనుకుంటున్న స్కూల్లో ఒకటో తరగతి ఫీజు ఏకంగా రూ.4.27 లక్షలని వాపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్య తరగతి వారికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందంటూ ఓ తండ్రి నెట్టింట ఆవేదన వ్యక్తం చేశాడు. తన కూతురిని చేర్పించాలనుకుంటున్న స్కూల్లో ఒకటో తరగతి ఫీజు ఏకంగా రూ.4.27 లక్షలని వాపోయాడు. నెట్టింట ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామంటూ అనేక మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు (Viral).
జైపూర్‌కు చెందిన రిషభ్ జైన్ భారీ స్కూలు ఫీజు గురించి చెబుతూ ఈ పోస్టు పెట్టారు. తన కూతురిని ఒకటో తరగతికి రానుందని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నారి కోసం ఓ స్కూలును ఎంపిక చేసినట్టు కూడా చెప్పారు. అయితే, అక్కడ ఒకటో తరగతికే రూ.4.27 లక్షలు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు.
Viral: ఈ సింహం ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి.. తృటిలో తప్పిన చావు!
‘‘ఈ దేశంలో మిడిల్ క్లాస్ వారికి నాణ్యమైన విద్య ఓ లగ్జరీగా మారిపోయింది. ఇతర స్కూళ్లల్లో కూడా ఇదే స్థాయిలో ఫీజులు ఉన్నాయి. ఒకటో తరగతిలో చేర్పించేందుకు రిజిస్ట్రేషన్ ఫీజులు రూ.2 వేలు అట. అడ్మిషన్ ఫీజు మరో రూ.40 వేలు, రిఫండబుల్ కాషన్ మనీ రూ.5 వేలు. వార్షిక ఫీజు రూ.2.52 లక్షలు, బస్ చార్జీలు రూ. 1.08 లక్షలు, బుక్స్ యూనిఫామ్ రూ.20 వేలు మొత్తం కలిపితే సంవత్సరానికి రూ.4.27 లక్షలు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏటా రూ.20 లక్షలు సంపాదిస్తు్న్న వారు కూడా ఈ స్కూల్లో తమ పిల్లలను చదివించేందుకు వెనకాడతారని అన్నాడు. ‘‘మీ జీతంలో 50 శాతాన్ని ఆదాయపు పన్ను, జీఎస్‌టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాండ్ రిజిస్ట్రీ చార్జీలు తదితరాల కింద ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఇది కాగా టర్మ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పీఎఫ్, ఎన్‌పీఎస్ వంటివి కట్టుకోవాలి. ఇక ఏటా 20 లక్షల ఇన్‌కమ్ ఉన్న వారు 30 శాతం ప్లస్ సెస్ పన్ను కేటగిరీ పరిధిలోకి వస్తారు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి రారు. అలా అని ధనికులకు లభించే ఇతర ఉచితాలు లేదా లోన్ల మాఫీ వంటివేవి వీళ్లకు రావు’’
‘‘ఇవన్నీ పోగా మిగిలిన 10 లక్షల్లో తిండి, బట్ట, రెంటు, లేదా ఈఎమ్ఐలు, పిల్లల స్కూలు ఫీజులు వంటివి కట్టుకోవాలి’’ అంటూ అతడు తన పోస్టు ముగించాడు.
Viral: లాబొరేటరీలో 100 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రయోగం గురించి తెలిస్తే..
గత కొద్దిరోజులుగా నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న ఈ పోస్టుకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అనేక మంది రిషభ్ అభిప్రాయాలతో ఏకీభవించారు. ఇంత డబ్బు వెచ్చించినా నైణ్యమైన విద్య దొరుకుతుందన్న గ్యారెంటీ లేదన్నారు. లాభాపేక్ష రహిత సంస్థలుగా ప్రభుత్వం వద్ద రిజిస్టరైన ఈ స్కూళ్లు తల్లిదండ్రుల వద్ద మాత్రం భారీగా డబ్బు దండుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ ఈ మధ్య ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Viral: అమ్మో.. సొర చేపపై స్వారీ.. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా