Share News

Viral News: భోజ్‌పురి పాటకు హుషారుగా టీచర్ స్టెప్పులు

ABN , Publish Date - Sep 09 , 2024 | 09:57 PM

బ్లాక్ కలర్ చీర పట్టుకున్న టీచర్ స్టెప్పులేసింది. ఆ వీడియో 1.30 నిమిషాలు ఉంది. ఎనర్జీ ఏ మాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేశారు. మిగతా టీచర్లు ఎంకరేజ్ చేస్తోండగా.. విద్యార్థులు ఈలలతో జోష్ నింపారు. వీడియో బయటకు రాగా.. ఆ టీచర్ తీరును నెటిజన్లు తప్పు పట్టారు. ఆ లేడీ టీచర్ ఇలా డ్యాన్స్ చేయడం సరికాదని హితవు పలికారు.

Viral News: భోజ్‌పురి పాటకు హుషారుగా టీచర్ స్టెప్పులు
Female Teacher's Controversial Bhojpuri Dance

టీచర్స్ డే (Teachers Day) రోజున ఓ ఉపాధ్యాయురాలు స్టెప్పులేశారు. స్కూల్ ఆవరణలో భోజ్ పురి పాటకు డ్యాన్స్ చేశారు. విద్యాబుద్దులు చెప్పే గురువులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. మంచి, చెడులు చెప్పాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీచర్లు పిల్లలతో కలిసి పోతున్నారు. ఆడి పాడుతున్నారు. అలా ఓ టీచర్ జోరుగా స్టెప్పులేశారు. ఆమె డ్యాన్స్ చేసే సమయంలో కొందరు విద్యార్థులు కూర్చొని ఉన్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.


1.30 నిమిషాల వీడియో

బ్లాక్ కలర్ చీర పట్టుకున్న టీచర్ స్టెప్పులేసింది. ఆ వీడియో 1.30 నిమిషాలు ఉంది. ఎనర్జీ ఏ మాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేశారు. మిగతా టీచర్లు ఎంకరేజ్ చేస్తోండగా.. విద్యార్థులు ఈలలతో జోష్ నింపారు. వీడియో బయటకు రాగా.. ఆ టీచర్ తీరును నెటిజన్లు తప్పు పట్టారు. ఆ లేడీ టీచర్ ఇలా డ్యాన్స్ చేయడం సరికాదని హితవు పలికారు.


teacher-dance.jpg


అవమానం మరొకటి ఉంటుందా..?

టీచర్స్ డే రోజున.. గురువు ఇలాంటి పాటకు డ్యాన్స్ చేయడమా..? ఇంతకన్నా అవమానకరం మరొకటి ఉంటుందా..? అని ఓ యూజర్ రాసుకొచ్చారు. పాఠశాలలు ఇలా ఉంటే ఇక విలువలు ఎక్కడినుంచి వస్తాయి అని మరొకరు ప్రశ్నించారు. ఇక్కడ విద్యా బోధన ఏ స్థాయిలో జరుగుతుందో మీరే ఒకసారి ఆలోచించండి. టీచర్స్ డే రోజున ఓ లేడీ ఉపాధ్యాయురాలు ఇలా డ్యాన్స్ చేయడం ఏంటని నిలదీశారు.


రివర్స్ అటాక్..

టీచర్స్ డే రోజున ఆ లేడీ టీచర్ జోష్‌తో కాలు కదిపింది. తనను అంతా ప్రశంసిస్తారు అనుకొంది. నెటిజన్లు రివర్స్ అయ్యారు. గురువు స్థానంలో ఉండి, పిల్లలకు నేర్పే బుద్దులు ఇవేనా అని ప్రశ్నించడంతో నీళ్లు నమలాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి:

Viral News: పులికి ముద్దులు.. తిరిగి పులి ఏం చేసిందంటే

Viral News: 14 ఏళ్ల బాలిక.. బాహుబలిలా మారి..

Viral News: అండర్ వేర్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. చివరికి

Updated Date - Sep 09 , 2024 | 09:57 PM