Share News

Viral Video: సొమ్మసిల్లి పడిన కాకి..

ABN , Publish Date - Sep 21 , 2024 | 07:54 PM

పక్షికి షాక్ తగిలితే తల్లడిల్లిపోయాడు పోలీస్. ఆ కాకిని పట్టుకొని సీపీఆర్ చేశాడు. నోటిలో నోరు పెట్టి ఊది ప్రాణాలను కాపాడాడు.

Viral Video: సొమ్మసిల్లి పడిన కాకి..
Fire Officer CPR To Crow

హిందువులు కాకులను పూర్వీకులుగా భావిస్తారు. వినాయక చవితి తర్వాత పితృ పక్ష సమయం. కాకులు ఇంటికి వస్తే పూర్వీకులు ఇంటికి వచ్చారని విశ్వసిస్తారు. కాకులు ఇంటి పైన కూర్చొని ఆరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని అంటుంటారు. ఓ కాకి కరెంట్ షాక్ తగిలింది. సొమ్మసిల్లి పడిపోయింది. ఆ కాకి పట్ల ఓ పోలీస్ సిబ్బంది ఔదార్యం చూపించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.


కాకికి షాక్

కోయంబత్తూరులో విద్యుత్ వైర్ల మీద ఉన్న ఓ కాకి షాక్ తగిలింది. నేల మీద పడిపోయి, మెలికలు తిరుగుతోంది. కాకి పడిపోవడంతో పక్కనే ఉన్న అగ్నిమాపక సిబ్బందికి జాలి కలిగింది. ఆ కాకిని చేతుల్లోకి తీసుకొని కాపాడారు. నోటిలో నోరు పెట్టి సీపీఆర్ చేశారు. కాకికి నోటి ద్వారా శ్వాస అందించారు. దీంతో ఆ కాకి కోలుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


వావ్.. గ్రేట్

ఫైర్ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది నిజమైన సేవ అని ఒకరు రాసుకొచ్చారు. ఆపదలో ఉన్న పక్షిని చూసి సాయం చేయడం చాలా మంచి విషయం. నిజంగా అతనికి హ్యాట్సాప్ అంటూ రాసుకొచ్చారు. నిజమే మరి పక్షి పట్ల అతను చూపిన ఉదారతను ప్రతి ఒక్కరు ప్రశంసించాల్సిందే. అది ఓ కాకి పట్ల అతను చూపిన దయ, జాలిని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.


అపశకునంగా భావిస్తారు

వాస్తవానికి కాకి అంటే కొందరు అపశకునంగా భావిస్తారు. కాకి తాకిన, తలపై నుంచి పోయిన చెడుగా భావిస్తారు. అలా జరిగితే ఇంట్లో వారికి మంచి జరగదని నమ్ముతారు. ఎవరో ఒకరు చనిపోతారని విశ్వసిస్తారు. అలాంటి కాకి పట్ల ఫైర్ సిబ్బంది మానవత్వం చూపారు. ఎలాంటి సెంటిమెంట్ లేకుండా కాకిని కాపాడారు. సెంటిమెంట్ అనే కొందరికి అలాంటివేమి లేవని చేతలతో నిరూపించారు. కాకి కూడా ఓ జీవి, పక్షి కదా అని ప్రూవ్ చేశారు. నిజమే అతని సేవా గుణాన్ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం

Updated Date - Sep 21 , 2024 | 07:54 PM