Viral Video: ప్రాణాలు కాపాడాడు.. ఆపై పొట్టు పొట్టు కొట్టాడు..!
ABN , Publish Date - Jun 16 , 2024 | 01:22 PM
Latet Viral News: ఎవరైనా నీటిలో పడి మునిగిపోతుంటే.. అది చూసిన వారిని ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తారు. ఈత వస్తే.. వెంటనే దూకేసి వారిని రక్షిస్తారు. ఇక్కడ కూడా ఓ మత్స్యకారుడు అదే పని చేశాడు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తిని మత్స్యకారుడు తన ప్రాణాలకు తెగించి కాపాడాడు.
Latet Viral News: ఎవరైనా నీటిలో పడి మునిగిపోతుంటే.. అది చూసిన వారిని ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తారు. ఈత వస్తే.. వెంటనే దూకేసి వారిని రక్షిస్తారు. ఇక్కడ కూడా ఓ మత్స్యకారుడు అదే పని చేశాడు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తిని మత్స్యకారుడు తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఒడ్డుకు లాక్కొచ్చు అతని ప్రాణాలను రక్షించాడు. అయితే, అతగాడు చేసిన పనికి మత్స్యకారుడికి చాలా కోపం వచ్చింది. ఇంత పిచ్చి పని చేస్తావా? అంటూ కోపంతో ఊగిపోయాడు. ఒడ్డుకు చేరిన తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి చెంపలు రెండు వాయించాడు. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొట్టు పొట్టుగా కొట్టాడు. అనంతరం అతన్ని నది నుంచి బయటకు తీసుకువచ్చి.. పోలీసులకు అప్పగించారు. అయితే, అతనితో పాటు.. మరో అమ్మాయి కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఇద్దరినీ మత్స్యకారులు సేవ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ఈ ఘటన ఎక్కడ జరిగింది వంటి వివరాలను తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, మహిళ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఏమైందో తెలియదు గానీ.. సుల్తాన్‌పూర్‌లోని గోమది నది వద్దకు వచ్చి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిని గమనించిన మత్స్యకారులు.. ఆ ఇద్దరినీ కాపాడారు. ఓ వైపు అమ్మాయిని కాపాడి బ్రిడ్జి పిల్లర్ పై కూర్చోబెట్టగా.. మరోవైపు వ్యక్తిని ఒడ్డుకు లాక్కొచ్చి కూర్చోబెట్టాడు మరో మత్స్యకారుడు. అయితే, అతను చేసిన పిచ్చి పనికి మత్స్యకారుడు ఆగ్రహానికి గురయ్యాడు. ఇదేం పని అంటూ పదే పదే కొట్టాడు. అనంతరం బయటకు తీసుకువచ్చి.. పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు..
Also Read:
చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని.. గుంటూరులో ఫ్లెక్సీ..!
నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు...