Share News

Viral Video: ఐదు సింహాలు చుట్టుముడితే ఎలా ఉంటుంది.. ఓ హిప్పో ఏం చేసిందో చూడండి..!

ABN , Publish Date - Aug 03 , 2024 | 02:58 PM

వన్య ప్రాణాలకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సింహాలు, పులులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి.

Viral Video: ఐదు సింహాలు చుట్టుముడితే ఎలా ఉంటుంది.. ఓ హిప్పో ఏం చేసిందో చూడండి..!
Lionesses clashed with a hippopotamus together

వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సింహాలు, పులులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. సఫారీ టూర్‌ల (Safari Tour) పేరుతో అటవీ పర్యటనకు వెళ్తున్న వారు అక్కడి ఘటనలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో జరిగిన ఓ యుద్ధానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ నది ఒడ్డున ఐదు సింహాలు (Lions) సేద తీరుతున్నాయి. ఆ సమయంలో హిప్పోపొటామస్ (Hippopotamus) ఒడ్డు మీదకు వచ్చింది. ఆ హిప్పోను ఐదు సింహాలు చుట్టుముట్టాయి. దానిపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. అయితే ఆ హిప్పో తన ప్రాణాలను కాపాడుకునేందుకు అద్భుతంగా పోరాడింది. చుట్టూ తిరుగుతూ సింహాలను బెదరగొట్టింది. దీంతో ఏ సింహమూ ఆ హిప్పో దగ్గరకు వెళ్లలేకపోయింది. ఆ తర్వాత అది తిరిగి నది వైపు వేగంగా వెళ్లిపోయింది.


ఒక సింహం హిప్పో పైకి ఎక్కడానికి ప్రయత్నించినా చివరకు వదిలేసింది. ఐదు సింహాలు చుట్టుముట్టినా ఆ హిప్పో స్వల్ప గాయాలతో బయటపడింది. సఫారీ టూర్‌కు వెళ్లిన యాత్రికుడు బారీ స్మిత్ ఈ వీడియోను రికార్డు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెరైటీ లంచ్ ప్యాక్.. అమ్మాయి పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

Viral News: పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు.. న్యూజిలాండ్ మహిళకు వింత అనుభవం!


Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!

Viral Video: వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా? డ్రైవర్‌కు కండక్టర్ చేస్తున్న సహాయం చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 03 , 2024 | 02:58 PM