Share News

Flipkart: ఇంతకు మించిన దారుణం ఉంటుందా!? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22 వేల స్మార్ట్ ఫోన్ ఆర్డరిస్తే..

ABN , Publish Date - Mar 30 , 2024 | 07:32 PM

ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటి ఆర్డరిస్తే మరో వస్తువు డెలివరీ అయిన ఉదంతాలు గతంలో అనేకం చూశాము. అయితే, వాటన్నిటికీ మంచిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

Flipkart: ఇంతకు మించిన దారుణం ఉంటుందా!? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22 వేల స్మార్ట్ ఫోన్ ఆర్డరిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటి ఆర్డరిస్తే మరో వస్తువు డెలివరీ అయిన ఉదంతాలు గతంలో అనేకం చూశాము. అయితే, వాటన్నిటికీ మంచిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. స్మార్ట్ ఆర్డరిచ్చిన (SmartPhone Ordered) ఓ వ్యక్తి చివరకు తనకు డెలివరీ అయినదేంటో చూసి నోరెళ్లబెట్టాడు. లబోదిబోమంటూ తన కష్టాన్ని నెట్టింట వెళ్లబోసుకున్నాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral News) మారింది.

NEET: అలా అయితే.. మేనేజ్‌మెంట్ కోటాలో చదివిన డాక్టరే కావాలని అడగండి: అన్‌అకాడమీ సీఈఓ


యూపీలోని (UP) ఘాజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఫ్లిప్‌కార్టులో (FlipKart) సుమారు రూ.22 వేలు పెట్టి ఓ స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టాడు. ఇంటికి డెలివరీ అయినా ప్యాకెట్ విప్పి చూస్తే గులకరాళ్లు కనిపించాయి (Stones Delivered). ఒక ఫోన్‌కు బదులు ఇంకో ఫోన్ రావడం చూశాను గానీ ఏకంగా గులకరాళ్లు రావడం తానెప్పుడూ చూడలేదని అతడు వాపోయాడు. అంతేకాదు, తాను డెలివరీ ప్యాకెట్‌ను రిటర్న్ చేసేందుకు ప్రయత్నించినా కంపెనీ తిరస్కరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.


ఈ ఉదంతం నెట్టింట వైరల్ కావడంతో అనేక మంది బాధితుడికి బాసటగా నిలిచారు. కంపెనీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దీంతో, స్పందించిన కంపెనీ కస్టమర్‌కు ఎదురైన అనుభవంపై విచారం వ్యక్తం చేసింది. ఆర్డర్ వివరాలను నేరుగా మెసేజ్ చేస్తే సమస్య పరిష్కారానికి కృష్టి చేస్తామని హామీ ఇచ్చింది. కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా చూడటమే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పుకొచ్చింది.

Viral: ట్రాఫిక్ జాంలో ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ చేస్తోందేంటో రికార్డు చేసి నెట్టింట పెడితే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 07:38 PM