Viral: అతడి జీవితం నాశనం చేసిన ప్రభుత్వంలో పశ్చాత్తాపం! ఏకంగా రూ.116 కోట్ల పరిహారం! జరిగిందేంటో తెలిస్తే..
ABN , Publish Date - Feb 17 , 2024 | 04:25 PM
అకారణంగా తన జీవితం కోల్పోయిన ఓ వ్యక్తి ప్రభుత్వం ఏకంగా రూ.116 కోట్ల పరిహారం ప్రకటించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: అకారణంగా తన జీవితం కోల్పోయిన ఓ వ్యక్తికి ప్రభుత్వం ఏకంగా రూ.116 కోట్ల పరిహారం ప్రకటించింది. అమెరికాలోని (USA) ఫ్లోరిడా రాష్ట్రంలో (Florida) ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. రాబర్ట్ డుబ్వా (57) అనే వ్యక్తికి సుమారు 37 ఏళ్ల క్రితం ఓ కేసులో మరణ శిక్ష పడింది. అప్పటికి అతడి వయసు కేవలం 18 ఏళ్లు. జీవితం అంటే ఏంటో తెలీని దశలోనే అతడు జైలు పాలయ్యాడు. టాంపా ప్రాంతంలో ఓ టీనేజ్ యువతిని హత్య చేసిన కేసులో అతడికీ శిక్ష ఖరారైంది. లైంగిక దాడి చేసినందుకూ అతడిపై కేసు నమోదైంది. తను నిర్దోషినని మొదటి నుంచీ వాదిస్తున్న రాబర్ట్ న్యాయపరమైన అన్ని మార్గాల్లో ప్రయత్నించి మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించుకున్నాడు.
Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!
మద్యం సేవించేటప్పుడు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!
అయితే, 2018లో అతడికి తనని తాను నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం మళ్లీ వచ్చింది. ఇన్నోసెన్స్ ప్రాజెక్టు ఆర్గనైజేషన్ అనే సంస్థ జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వ లాయర్లు ఈ కేసును పునఃసమీక్షించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో నిర్వహించిన డీఎన్‌ఏ టెస్టుల్లో రాబర్ట్ నిర్దోషిత్వం బయటపడింది. బార్బరాను హత్య చేసింది మరో ఇద్దరు వ్యక్తులని వెలుగులోకి వచ్చింది. దీంతో, 2020లో కోర్టు అతడికి విముక్తి కలిగించింది. (Florida man wrongly jailed for 37 years gets 14 million dollars compensation).
ఈ ఫుడ్స్ చేపలకంటే చాలా బెటర్! ఎందుకో తెలిస్తే..
న్యాయం కోసం చేసిన సుదీర్ఘపోరాటంలో అతడి జీవితమే వృథా అయిపోయింది. దీంతో, అతడు తాను కోల్పోయిన దాంట్లో కొంతైనా వెనక్కు తెచ్చుకునేందుకు మరో న్యాయపోరాటం ప్రారంభించారు. ఈసారి ఏకంగా టాంపా నగర పాలకులపైనే కేసు వేశాడు. గతంలో తన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, ఓ ఫారెన్సిక్ డెంటిస్ట్‌ను కోర్టుకు ఈడ్చాడు. చివరకు నగర పాలక సంస్థ అతడితో కోర్టు బయట సెటిల్మెంట్ చేసేందుకు అంగీకరించింది. ప్రభుత్వంలో కూడా పశ్చాత్తాపం మొదలైందో ఏమో కానీ నగరపాలక గురువారం రాబర్ట్‌కు 14 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘‘ఇది చాలా పెద్ద తప్పు. ఈ పరిహారంతో అతడికి కాస్తంతైనా మానసిక సాంత్వన చేకూరాలని ఆశిస్తున్నా’’ అంటూ నగర పాలక సంస్థ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.
ఒంటిపై గాయాలు త్వరగా మానట్లేదా? మీకీ లోపం ఉన్నట్టే!
ఎట్టకేలకు తను ఆశించిన న్యాయం జరిగినందుకు రాబర్ట్ హర్షం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లుగా తను అనుభవిస్తున్న బాధ తీరిందన్నాడు. తనకు జరిగిన నష్టాన్ని ఎదీ పూడ్చలేదన్న రాబర్ట్.. ఈ పరిహారంతో తాను అనుభవిస్తున్న నరకానికి ముగింపు పడిందని వ్యాఖ్యానించారు. ‘‘నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనందుకు నాకు ఇప్పుడు ఎటువంటి బాధ లేదు. మిగిలున్న కాస్త జీవితాన్ని నేను బాధ, కోపంతో వృథా చేయదలుచుకోలేదు’’ అని రాబర్ట్ చెప్పాడు. ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం, నగర పాలక సంస్థ, రాబర్ట్‌కు, అతడి లా ఫర్మ్‌కు ఈ ఏడాది 9 మిలియన్ డాలర్లు, వచ్చే ఏడాది మరో 3 మిలియన్ డాలర్లు, ఆపై ఏడాది 2 మిలియన్ డాలర్లు ఇవ్వనుంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి