Viral: మహిళ దాగుడుమూతల ఆట! బాయ్‌ఫ్రెండ్ సూట్‌కేసులో దాక్కోవడంతో..
ABN , Publish Date - Oct 27 , 2024 | 09:28 PM
సూట్‌కేసులో ఉన్న వ్యక్తిని అలాగే వదిలేసి అతడి మృతికి కారణమైన ఘటనలో మృతిని గర్ల్‌ఫ్రెండ్ దోషిగా తేలింది. ఈ కేసులో మహిళకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: సూట్‌కేసులో ఉన్న వ్యక్తిని అలాగే వదిలేసి అతడి మృతికి కారణమైన ఘటనలో మృతిని గర్ల్‌ఫ్రెండ్ దోషిగా తేలింది. ఈ కేసులో మహిళకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది (Viral).
Viral: బాబోయ్.. బాణసంచా దుకాణం పెట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!
పోలీసులకు నిందితురాలు సారా బూన్ చెప్పిన వివరాల ప్రకారం, ఆమె ఫోరిడా వాస్తవ్యురాలు. తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ టోరెస్‌తో నాలుగేళ్ల క్రితం సరదాగా ఆడిన దాగుడూమూతల ఆట జార్జ్ మరణానికి కారణమైంది. 2020 ఫిబ్రవరి 23న మద్యం మత్తులో ఉన్న వారిద్దరూ దాగుడుమూతల ఆట ప్రారంభించారు. సూట్‌కేసులో దాక్కుని ఈ ఆట ఆడితే బాగుంటుందని భావించారు.
ఇంతలో సారాకు నిద్రముంచుకు రావడంతో ఆమె పడక మీదకు చేరింది. సూట్‌కేసులో ఉన్న బాయ్ ఫ్రెండ్ తనే స్వయంగా బయటకు వస్తాడని భావించి నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం మత్తు దిగాక మెళకువ వచ్చిన ఆమెకు బాయ్‌ఫ్రెండ్ సూట్‌కేసులో దాక్కున్నాడన్న విషయం గుర్తుకు వచ్చింది. వెళ్లి సూట్ కేసు జిప్ తెరిచి చూడగా అతడు విగతజీవిగా కనిపించాడు.
Viral: ఇలాంటోళ్ల వల్లే సోషల్ మీడియాలో భారత్ ఇమేజ్ పెరిగేది.. వైరల్ వీడియో!
ఇదిలా ఉంటే దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఆమె సెల్‌ఫోన్‌లో కొన్ని షాకింగ్ వీడియోలు కనిపించాయి. ఇందులో టోరెస్ తనకు ఊరిరాడట్లేదని అరవడం కనిపించింది. పలుమార్లు అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచినట్టు కూడా రికార్డైంది.‘‘నన్ను మోసం చేసినప్పుడు కూడా నేను ఇలాగా ఊపిరాడనట్టు ఫీలయ్యా.. నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తే ఇలాగే అవుతుంది’’ అని సారా టోరెస్‌తో అనడం వీడియోల్లో కనిపించింది. దీంతో, పోలీసులు సారాపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
Viral: బాస్ తిట్టడంతో షాక్! చలనం లేకుండా బొమ్మలా మారిపోయిన యువతి!
అయితే, విచారణ సందర్భంగా సారా తాను నిర్దోషినని వాదించింది. దాగుడుమూతల ఆట సందర్భంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది. గతంలో తామిద్దరం గొడవపడిన వాస్తవమేనని చెప్పుకొచ్చింది. ఘటన జరిగిన రోజు కూడా అభద్రతా భావానికి లోనై, అతడిని అలాగే వదిలేసినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు, టోరెస్ శరీరంపై పలుచోట్ల స్వల్ప గాయాలైనట్టు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది.
అయితే, ఈ కేసుకు సంబంధించి నిందితురాలు పలు మార్లు అప్పీలుకు వెళ్లడంతో విచారణకు ఆటంకాలు కలిగాయి. చివరకు జ్యూరీ తాజాగా ఆమెను దోషిగా తేల్చింది. డిసెంబర్ 2ను కోర్టు ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.