Share News

Shopping Tips: దసరా ఆఫర్లతో జాగ్రత్త.. షాపింగ్‌లో మీ డబ్బులు ఆదా చేసే టిప్స్..

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:15 AM

మాల్స్‌లో షాపింగ్ చేయడానికి వెళ్లినప్పుడు కూడా అక్కడి ఆఫర్లు ఆకర్షిస్తుండటంతో అవసరానికి మించిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇంటి దగ్గర లిస్ట్ రాసుకున్న వస్తువులకంటే అవసరం లేనివి కొనడంతో ఊహించినదానికంటే ఎక్కువ మొత్తంలో బిల్లు అవుతుంది. పెద్ద పెద్ద మాల్స్, ఈ కామర్స్ సైట్‌లో షాపింగ్ చేసేటప్పుడు..

Shopping Tips: దసరా ఆఫర్లతో జాగ్రత్త.. షాపింగ్‌లో మీ డబ్బులు ఆదా చేసే టిప్స్..
Money Saving Tips

పండుగలు వచ్చాయంటే చాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్లు ఎన్నో ఆఫర్లు పెడతుంటాయి. ఆఫర్లకు ఆకర్షితులై అవసరం లేకపోయినా వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. తీరా కొన్న తర్వాత ఉపయోగించకపోవడంతో వస్తువులు పాడైపోతాయి. దీంతో అనవసరం డబ్బులు వేస్ట్ చేశామని బాధపడుతుంటారు. అంతేకాదు మాల్స్‌లో షాపింగ్ చేయడానికి వెళ్లినప్పుడు కూడా అక్కడి ఆఫర్లు ఆకర్షిస్తుండటంతో అవసరానికి మించిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇంటి దగ్గర లిస్ట్ రాసుకున్న వస్తువులకంటే అవసరం లేనివి కొనడంతో ఊహించినదానికంటే ఎక్కువ మొత్తంలో బిల్లు అవుతుంది. పెద్ద పెద్ద మాల్స్, ఈ కామర్స్ సైట్‌లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డబ్బులను ఆదా చేసుకోవచ్చు.

Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..


ముందుగా లిస్ట్, బడ్జెట్ అంచనా..

షాపింగ్‌కు వెళ్లే ముందు అవసరమైన వస్తువలకు సంబంధించి ఒక లిస్ట్ తయారుచేసుకోవాలి. అదే సమయంలో ఎంత బడ్జెట్‌తో షాపింగ్ చేయాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని లిస్ట్ రెడీ చేసుకోవాలి. ముందుగా అత్యవసరమైన వస్తువల జాబితాను ముందు వరుసలో రాసుకోవాలి. ఎమర్జెనీ కాని వస్తువలను కిందకు రాసుకోవాలి. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు మనం ముందుగా నిర్ణయించుకున్న బడ్జెట్ అమౌంట్‌కు పది నుంచి ఇరవై శాతం ఎక్కువుగా పెట్టుకుని వెళ్తే సరిపోతుంది. అలాకాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకెళ్లడం ద్వారా అవసరం లేని వస్తువులను ఎక్కువుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంచనా వేసుకున్న బడ్జెట్‌ మొత్తాన్ని తీసుకెళ్తే అనవసరమైన వస్తువులు కొనాలనే ఆలోచన రాదు. అత్యవసరమైన వస్తువులను మొదట రాసుకుంటే, బిల్లు ఎక్కువుగా అనిపిస్తే లిస్ట్‌లో చివర రాసుకున్న వస్తువులను తీసేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఏ వస్తువులు ఉంచాలి.. ఏవి తీసేయాలనేదానిపై కన్ఫ్యూజన్‌కు గురికావచ్చు.

Today Horoscope : ఈ రాశి వారికి ఖర్చులు అధికం


ఆఫర్ల విషయంలో..

షాపింగ్ చేసేటప్పుడు ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ల విషయంలో తొందరపడకూడదు. వాస్తవానికి ఒక వస్తువుకు ఆఫర్ ప్రకటించగానే.. ఆ వస్తువు యొక్క ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. వస్తువును ఉపయోగించడానికి సమయం తక్కువుగా ఉన్న వస్తువులను త్వరగా విక్రయించడానికి ఆఫర్లు పెడతారు. అటువంటి వస్తువులను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్నా.. ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆ వస్తువులను పడేయాల్సి వస్తుంది. అందుకే ముందుగా తినే పదార్థాలు, వంటకు ఉపయోగించే వస్తువుల విషయంలో ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి. ధరల విషయంలో కొన్ని సందర్భాల్లో మోసాలు జరిగే అవకాశం ఉంది. ఒక వస్తువు ధరను రెట్టింపు చేసి వాటిపై ఆఫర్లు ప్రకటిస్తారు. మన మనసులో ఆఫర్ అనే విషయం బలంగా ఉండటంతో ధరల విషయాన్ని పట్టించుకోము. అందుకే షాపింగ్ విషయంలో ధరలను ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. పై చిట్కాలు పాటిస్తే షాపింగ్ సమయంలో డబ్బులను ఆదా చేసుకోవచ్చు.


Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..

Chanakya Niti: మీ పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే ఈ 3 టిప్స్ పాటించాల్సిందే

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 01 , 2024 | 11:15 AM