Share News

Viral: భారతీయ రైల్లోని మురికి వాష్‌రూం వీడియోను షేర్ చేసిన ఫారినర్!

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:37 AM

సెకెండ్ క్లాస్ భారతీయ రైల్లోని మురికి వాష్‌రూం వీడియోను ఓ విదేశీ మహిళ నెట్టింట నెట్టింట పంచుకుంది. దీంతో, ఫైరైపోయిన భారతీయులు వందేభారత్, ఫస్ట్ క్లాస్ రైళ్ల వీడియోలనూ షేర్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Viral: భారతీయ రైల్లోని మురికి వాష్‌రూం వీడియోను షేర్ చేసిన ఫారినర్!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లల్లో ప్రయాణికుల ఇక్కట్ల గురించి అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే, ఫారినర్లు మాత్రం పనిగట్టుకుని మరీ భారతీయ రైల్వేస్‌ను అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఓవైపు వందేభారత్‌ లాంటి అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తెస్తున్నా పట్టించుకోకుండా మురికి కూపాల్లా మారిన పాత రైళ్లల్లో దుస్థితిని పదే పదే ప్రస్తావిస్తూ, వాటి వీడియోలను పంచుకుంటూ తమ దుర్బుద్ధి ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలో ఓ విదేశీ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ భారతీయ రైళ్లల్లో బాత్‌రూం వీడియోలను షేర్ చేసి మళ్లీ వివాదం రాజేసింది. దీనిపై జనాలు మండిపడుతున్నారు (Viral).

Indian Railway Coaches: భారతీయ రైళ్లల్లో ఎరుపు, నీలం బోగీల మధ్య తేడా తెలుసా?


‘‘సెకెండ్ క్లాస్‌ రైల్లో వెస్టర్న్ టాయిలెట్’’ అనే క్యాప్షన్‌తో ఇరీనా మోరానో అనే విదేశీ మహిళ ఈ వీడియోను పోస్టు చేసింది. వాష్‌రూంలో తుప్పు పట్టిపోయిన పైపులు, అపరిశుభ్రంగా ఉన్న కమ్మోడ్, వాష్ బేసిన్ వంటివన్నీ చూపించింది. కొన్ని రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏకంగా 5.8 మిలియన్ల వరకూ వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో జనాలకు ఆగ్రహం తెప్పించడంతో ఇరీనాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘మీరు రెండో క్లాస్ బోగీలో ప్రయాణిస్తున్నారు. ఇది అత్యంత చవకైన రైలు. కాబట్టి ఓసారి ఫస్ట్ క్లాస్‌లో జర్నీ చేసి చూడండి’’ అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. ‘‘భారత్ లాంటి భారీ దేశాల్లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. అవన్నీ చూసి రావాలంటే బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే మీరు ఈ రైలును ఎంచుకున్నారు. వందేభారత్ లేదా మెట్రో రైళ్లు వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. పరాయి దేశంలో ఉన్నప్పుడు అక్కడి పరిస్థితులకు అర్థం చేసుకుని, గౌరవ మర్యాదలతో మసులుకోండి’’ అని పేర్కొన్నారు.

Viral: గూగుల్‌ను కోర్టుకు ఈడ్చీ.. 2 బిలియన్ పౌండ్ల జరిమానా పడేలా చేసి..


‘‘ఈ సెకెండ్ క్లాస్ టిక్కెట్ ఖరీదు రూ. 120 కి మించదు. ఇది రెండు అమెరికన్ డాలర్ల కన్నా తక్కువే. యూఎస్ఏలో ఈ డబ్బుతో పిజ్జాపై వేసుకునే టాపింగ్ కూడా రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. భారతీయ మిడిల్ క్లాస్ వర్గం కూడా ఈ రైళ్లల్లో ప్రయాణించదు. కాబట్టి, మీరు మీ బడ్జెట్ పెంచుకుని మరింత మెరుగైన సౌకర్యవంతమైన రైళ్లల్లో ప్రయాణించండి. ఇక్కడి బాత్రూమ్‌లను చూసి భారతీయ రైళ్లన్నింటిలో ఇలాగే ఉంటుందనేలా వీడియోలు పెట్టొద్దు’’ అని హితవు పలికారు.

ఇలా రకరకాల విమర్శలు వెల్లువెత్తడంతో మహిళ ఫస్ట్ క్లాస్ రైల్లోని వాష్‌రూం వీడియోను పోస్టు చేసింది. ‘‘సెకెండ్ క్లాస్ వాష్‌రూం వీడియో తరువాత ఫస్ట్ క్లాస్ బోగీలోని వాష్‌రూం వీడియో పోస్టు చేస్తున్నా’’ అని ఆమె తన వీడియోకు క్యాప్షన్ పెట్టింది. దీనికి కూడా నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

రూ.8 కోట్లు ఇవ్వలేదని భర్తను హత్య చేసి.. పోలీసులకు దొరక్కుండా..

Read Latest and Travel News

Updated Date - Oct 29 , 2024 | 12:00 PM